‘అబ్బా!’ మధురాలొలికే ఆమె అధరాలపై నెత్తుటి గాయం.‘‘ఏమైందీ?’’ అడుగుతూనే ఆపుకోలేని తమకంతో ఆమె పెదాల్ని మరోసారి బలంగా కొరికాడతడు.‘‘నీ మునిపంటి గాటుకి నా పెదాలు చిట్లాయి. రక్తం’’ అంది ఆమె ప్రతిగా ప్రతీకారంతో అతడి చెవిని గట్టిగా కొరుకుతూ.‘‘అయ్యో.... నొప్పి?’’‘‘బాధగా ఉందా?’’ ఆమె అడిగింది. అంత లోనే... ‘చేదూ ఓ రుచిలా... బాధ కూడా తీయగా ఉంది కదూ’’ అంటూ అతడిని మరింత దగ్గరగా లాక్కుంది. ఆ చొరవకి ముగ్ధుడవుతూ తనంటూ లేకుండా ఆమెలో లీనమయ్యేందుకు రహస్యదారుల్ని అన్వేషిస్తున్నాడతడు.‘‘నిజానికి ఇది హింసే. వయసొచ్చిన ఓ ఆడామగా పదాల్లో నిర్వచించలేని ఒకానొక అద్భుత సౌఖ్యాన్ని వెతుక్కుంటూ సాగించే ఈ క్రీడలో అడుగడుగునా, అణువణువునా హింసే. శత్రువైతే సరే... శతసహస్ర వ్యూహాలు రచించి తుదముట్టించొచ్చు. కానీ, మనసుపడ్డ వ్యక్తిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ఉక్కు కౌగిలిలో బిగించి ఊపిరాడనీయకుండా చేయడం... ఎక్కడపడితే అక్కడ గోళ్లతో రక్కేయడం, పళ్లతో కొరికే యడం! ఓహ్‌! ఇదంతా ఇష్టమేనా?’’ పైట చాటు పాలపుంతల అంతుచూస్తూ, ఆయాసపడుతూ అడుగుతున్నాడతడు. అత్యంత పరాక్రమంతో అతడు ఒక్కో శరీరభాగాన్ని ఆక్రమించుకుంటుంటే... తాను ఓడిపోయేందుకు, అతడు గెలిచేందుకు ఒద్దికగా, ఓపిగ్గా సహకరించే వ్యాపకంలో తలమునకలైన ఆమె అతడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు.

‘‘మాట్లాడవేం?’’ మళ్ళీ అడిగాడతడు.‘‘ఒక్కోసారి మౌనమే మంచి సమాధానమవుతుంది’’.‘‘అయినా సరే... నా సందేహ నివృత్తి చేయాల్సిందే’’.‘‘చేస్తున్నా కదా.. దేహాల సందేహాల నివృత్తి’’ గలగలా నవ్వింది. ఆ నవ్వు అతడిలో రగుల్తున్న కోరికల్ని రెట్టింపు చేసింది. కనిపించిన ప్రతిచోటా ముద్దుల ముద్రలేస్తూ పళ్లతో గాటులు చేస్తూ అడిగాడు - ‘‘ఇదంతా హింసే కదా!’’‘‘ఇది హింసని తెలుస్తున్నా... తరతరాలుగా, యుగయుగాలుగా స్ర్తీ పురుషులు అభిలషిస్తున్నారంటే బాధే సౌఖ్యమనే భావం. ఇంకో రకంగా చెప్పాలంటే... ముక్కుమూసుకుని తపస్సు చేసే మునులు కోరుకునే మోక్షం, స్వర్గం ఇదే. ఔను నిజం. సరస సౌందర్య అప్సరసాభామినులైన రంభా ఊర్వశి మేనకల కౌగిళ్ల సుఖం అందించే స్వర్గం కోసమే కదా... మునులు తపస్సు చేస్తారు. కామికానివాడు మోక్షగామి కాడని తెలుసుకున్ననాడు.... స్వర్గం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. అందుకే.... అంటున్నా. ప్లీజ్‌! కదిలించకు ఈ స్వర్గం’’ అంటూ ఆమె అతడ్ని మరింతగా కరుచుకుంది.