మొదటి ఆరునెలలు:సోషల్ సెక్యూరిటీ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్‌లుతీసుకుంటాడు.అక్కడి రోడ్ల మీదడ్రైవ్ చేయడంలోని భయాన్ని కొద్దిగా జయించాక సెకండ్‌హ్యాండ్ కారునొకదాన్ని కొంటాడు. 500 డాలర్లు ఖర్చుచేసిఇండి యాలోని తన బంధుమిత్రులందరితో ఫోన్‌లో మాట్లాడతాడు. సబ్‌వే, మెక్‌డోనాల్డ్స్, వెండీస్‌లలోని ఫాస్ట్‌ఫుడ్స్‌తింటాడు.
తర్వాతి ఆరునెలలు:తన బ్యాంక్ అక్కౌంట్‌లో తక్కువ మొత్తం ఉందని గ్రహిస్తాడు. ముగ్గురుండే అపార్ట్‌మెంట్ నుంచి ఆరుగురు అద్దెకుండే అపార్ట్‌మెంట్‌కి మారతాడు. స్వంతకారులో ఆఫీస్‌కి వెళ్లకుండా, ఇంకో ముగ్గురితో కలిసి మరొకరి కారులో పెట్రోల్ ధరని షేర్‌చేస్తూ వెళ్తాడు. ఇండియాలోని ముఖ్యమైన వాళ్లతోనే ఫోన్‌లో అవసరం మేరకే మాట్లాడతాడు. ఇపడు ఫోన్ బిల్ 250 డాలర్లకి మించదు.
ఆ తర్వాతి ఆరునెలలు:వంట చేతనైంది. కొందరు మిత్రులు ఏర్పడ్డారు. ఇండియాలో కాశీ, రామేశ్వరం వెళ్లడం ఎలా ఆనవాయితీనో, అమెరికాలో నయాగరా జలపాతానికి వెళ్లడం అలా ఆనవాయితీ కాబట్టి అక్కడికి వెళ్ళొస్తాడు. అలాగే న్యూయార్క్ వైట్‌హౌస్‌లని కూడా చూస్తాడు. చలికి తన డొక్కు కారు స్టార్ట్ కాకపోవడంతో కొత్తకారు కొనే ఆలోచన చేస్తాడు.
తర్వాతి మూడు నెలలు:ఒంటరిగా ఫీలై పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన చేస్తాడు. ఇంటికి ఫోన్ చేసినపడల్లా భోజనం ఇబ్బంది గురించి చెప్తుంటాడు.
తర్వాతి మూడు నెలలు:తనకో వధువుని చూడమని తల్లిని కోరతాడు. అతను పనిచేసే కంపెనీ గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేయమని సూచిస్తుంది. సమస్య ఎదురవుతుంది. 10కె జీతానికి కొత్త ఉద్యోగంలోకి మారాలా? లేక ఇపడు పనిచేసే కంపెనీలోనే 5కె జీతానికే కొనసాగుతూ గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేయాలా?
తర్వాతి మూడు నెలలు:ఛీప్ ఎయిర్‌లైన్స్ టికెట్ల కోసం ఇంటర్నెట్‌లో వేట. ఇండియాకి ఓ విమానం టిక్కెట్ కొంటాడు. హర్దీస్ చాక్లెట్స్, సేల్‌లో టీషర్ట్‌లు, మిత్రులకి పెన్‌డ్రైవ్, చెల్లెలికి ఐ పాడ్, తండ్రికి క్వేకర్ ఓట్‌మీల్ ప్యాకెట్లు బహుమతులుగా కొంటాడు.కొన్ని పెళ్ళిచూపులు, తల్లితండ్రులతో కొంత చర్చ తర్వాత మూడువారాల తర్వాత అమెరికాకి తిరిగి వస్తాడు-పెళ్లాంతో (మిగిలిన భారతీయుల్లాగా ఇంత అదృష్టవంతులు కాదు. ముహూర్తం దొరక్క ఆరు నెలల తర్వాత వాళ్ళు పెళ్లిచేసుకోవడానికి మళ్లీ ఇండియాకి డబ్బు, సెలవు ఖర్చు చేసుకుని వెళ్లాలి)
తర్వాతి ఆరు నెలలు:మళ్లీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువైపోయింది. ఇండియా ట్రిప్‌కి, ఇంటి సామానుకి చాలా సేవింగ్స్ ఖర్చయ్యాయి. మరో రెండేళ్లదాకా ఇండియాకి వెళ్లలేడు. అందులో ఇప్పుడు కదిలితే ఇంకో అదనపు టిక్కెట్ తో కదలాలి. పైగా గ్రీన్‌కార్డ్ సంపాదించుకోవాలి.
రెండేళ్ల తర్వాత:ఇండియాకి వస్తాడు.ప్రతీ డాలర్‌ని లెక్కచూసి ఖర్చుచేస్తాడు. తనవైపు వారికన్నా తన భార్య వైపు వారికి ఎక్కువ బహుమతులు కొంటాడు (కొంటుంది). ఇండియాలో పనిచేసే తన మిత్రుల జీతాలు బాగా పెరిగాయని గమనిస్తాడు, ధరలు కూడా. అపడు బంజారాహిల్స్‌లో కొనాలనుకున్న ఫ్లాట్ ధరకి ఇప్పుడు మలక్‌పేట్‌లో కూడా ఫ్లాట్ రాదని గ్రహిస్తాడు. విజయవాడలో రావచ్చు తను అనుకున్నట్లుగా మరో మూడేళ్లల్లో ఇండియాకి వెనక్కి తిరిగి రాలేడు. ఇల్లుంటుంది కానీ క్యాష్ ఉండదు. కనీసం ఆరేళ్ళు కష్టపడాలని నిస్ప్రృహగా గ్రహిస్తాడు.