ఛెంగుఛెంగున గంతులేస్తూ ఉదయం బడికి వెళ్లిన పరిమళ సాయంత్రం నీరసంగా అడుగులు వేస్తూ యింటికి చేరింది. ఆమె చేతిలోని స్కూల్‌బ్యాగు లంచ్‌బాక్సు రాధ అందుకునే లోపునే గబగబా వచ్చి పార్వతి అందుకుని ‘‘బాత్రూమ్‌లోకి వెళ్లి కాళ్లూ చేతులు ముఖం కడుక్కుని రా’’ అంది. పది నిముషాలు కూర్చుని వెళదామనుకున్న పరిమళ కుర్చీలో కూర్చోకుండా లోనికి వెళ్లింది. అందుకున్న వాటిని శుభ్రం చేసి తడిగుడ్డతో తుడిచి చేతులు కడుక్కుంది పార్వతి. వంగిన నడుంతో పది కిలోల స్కూల్‌ బ్యాగ్‌తో అంతలో వచ్చాడు పవన్‌. ఆ బరువు అందుకుని ముందుకి తూలిపోయింది పార్వతి. బరువు తగ్గడంతో పార్వతి మాట వినకుండానే క్రికెట్‌ బ్యాట్‌తో పరుగు లంకించుకున్నాడు పవన్‌.

వస్తువుల్ని శుభ్రం చేస్తూ, ‘‘ఎక్కడ పడేస్తాడో వీటిని, అసలు శుభ్రం లేదు వీడికి’’ అని కసురుకుంటూ తడిగుడ్డతో తుడిచి దాచింది. చేతులు కడుక్కుని కూర్చున్న వెంటనే మళ్లీ స్ర్పింగ్‌లా లేచింది.ఆఫీసు నుంచి వచ్చిన కేశవరావును చూస్తూనే ‘‘ఆగండాగండి! హవాయి చెప్పులు ద్వారం దగ్గరుంచడం మరిచేను’’ అంటూ గబగబా లోనికి వెళ్లి తెచ్చింది. అది తొడుక్కుని లోని కొచ్చాడు కేశవరావు. మరదలు రాధ రాకతో పార్వతిలో మార్పు వచ్చిందనుకున్న కేశవరావు మనసు చిన్నబోయింది. అతనిచేతిలోని గొడుగును అందుకుని శుభ్రంగాతుడిచి క్లిప్‌ పెట్టి దాచిందామె. చేతులుకడుక్కుని వచ్చిన తను చీరకొంగుతో తుడుచుకుంటూండగానే పవన్‌ వచ్చి బ్యాట్‌ను వరండాలోకి విసిరి జుత్తు సర్దుకుంటుండడంచూసిన పార్వతి సహనం కోల్పోయింది. 

‘‘ఆగరా! బొత్తిగా శుభ్రం లేదు నీకు! అడ్డమైన చోట్లలో పడిన బంతిని ఆ బ్యాట్‌ను వదిలి అలాగేనా రావడం వెళ్లు! వెళ్లి శుభ్రంగా కాళ్లూ చేతులూ కడుక్కుని రా!’ అని కసిరింది. అంతలోనే టేబిల్‌పై నున్న మేగజైన్‌ను చూస్తూనే స్వరం హెచ్చిచి ంది పార్వతి. ‘‘ఇతనొకరు! ఎక్కడెక్కడి పుస్తకాలూ యింటికి తెస్తారు. బొత్తిగా శుభ్రం లేదు. అది ముట్టుకుందికే బాధగా వుంది.’’ అంటూ తడిగుడ్డతో శుభ్రంగాతుడిచి వుంచింది.అంతా చూస్తున్న రాధకి యిదంతా బాధ కలిగించింది. అక్క బాధ అర్థం కాకపోయినా సానుభూతి చూపింది. ఆమె పనులు చేసుకోలేక పోతోందని, చాలా నీరసంగా వుంటుందని కొన్నాళ్లు సహాయంగా పంపమని బావగారు భర్తకు ఉత్తరం రాస్తే వచ్చిందామె. కాని పార్వతి ఆమెను ఏ పనీ చేయనీయక తానే చేస్తూ వుంటే తాను ప్రేక్షకురాలైంది. పోస్టుమేన్‌ యిచ్చిన ఉత్తరాన్ని అందుకుని టేబిల్‌పైన ఉంచుతున్న రాధను చూసిన పార్వతి ఒక్క ఊపున షాక్‌ వచ్చినట్లు పరుగుతో వచ్చి అందుకుని దాన్ని తుడిచి అప్పుడు ఇచ్చింది. రాధ చిన్నబోయింది. చేతులు తుడుచుకుంది. స్నానం చేసి వచ్చిన కేశవరావుకు పార్వతి కాఫీ అందించి, అక్క చెల్లెళ్లిద్దరు కాఫీలు