బస్సు ఆగకుండానే వెళ్ళిపోయిందిరచన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయిమళ్ళా ప్రిన్సిపాల్‌ చేత చీవాట్లు తినాలి.సిటీ విమెన్స్‌ కాలేజిలో టైపిస్టుగా పని చేస్తోంది రచనఈ రోజు ఏమయిందే తెలియదు.అన్ని బస్సులూ విపరీతమైన రద్దీగా వున్నాయి.బస్సు స్టాపుకి దగ్గర్లోనే ‘‘అతను’’ నిలబడి వున్నాడుప్రతి రోజూ తాను అతనిని గమనిస్తూనే వుంది.స్కూటర్‌ని ఆనుకొని తననే చూస్తున్నాడు.రచనకు తాను అందగత్తెను కానని తెలుసునుయువకుల దృష్టిని తాను ఆకట్టుకోలేననీ తెలుసును.అతను అందంగా వున్నాడు.ఖరీదైన బట్టలు వేసుకొన్నాడుఅయినా తనను రోజూ గమనిస్తూ వుంటాడు.రచన కన్నులెత్తి చూసింది.అతను యీసారి కొంచెం దగ్గరగా వచ్చేడు.‘‘మీరు రెండు బస్సులు తప్పిపోయారు. మీకు లిఫ్టు కావాలంటే యివ్వగలను’’రచనకు యీ సన్నివేశం కంగారుగా వుందిఈ యువకుడి సహాయంతో తాను ఆలస్యం కాకుండా కాలేజికి వెళ్ళవచ్చును.కాని.. కాని.. మళ్ళీ ఏదో సంకోచం!అతను అన్నాడు‘‘నా పేరు రఘురాం. రండి. మిమ్మల్ని మీ ఆఫీసు దగ్గర దింపుతాను’’రచన మరి ఆలోచించలేదు.కళ్ళద్దాలలో నుండి తీవ్రంగా చూసే ప్రిన్సిపాల్‌ మేడమ్‌ చూపులంటే రచనకు వణుకు పుడుతుంది.ఆ తీక్షణతను తప్పించుకోవాలంటే యితని సహాయం తీసుకోవటం తప్పనిసరి అనిపించింది.ఇంక సంకోచించకుండా అతని స్కూటర్‌ ఎక్కింది.

రఘురాం స్కూటర్‌ని రివర్సు చేస్తూ అడిగాడు.‘‘ఎక్కడకు వెళ్ళాలి’’‘‘బేగంపేట’’రచన మాట పూర్తి కాలేదురివ్వున పోనిచ్చేడు.కాలేజి దగ్గర దిగుతూ అంది రచన‘‘మీకు చాల రుణపడివున్నాను. ఈరోజు టైముకి రాగలిగేను’’రఘురాం నవ్వేడు.ఆ రోజంతా రచన మనస్సులో వెన్నెల సోనలు సోనలుగా కురుస్తూనేవుంది.మళ్ళా మనస్సుని మందలించుకొంది.కొద్దిగా సహాయం పడినందుకు తాను అతని పట్ల విచలితురాలవుతోంది.అప్పుడప్పుడు తనతో పనిచేసే మగవారు తనను యింటి దగ్గర దింపుతూనే వుంటారు.ఇతనూ అంతే.కాని మనస్సు పాదరసంలా అతని గురించి ఆలోచన వైపే పరుగులు పెడ్తోంది.ఇంటికి వస్తూంటే గాలిలో తేలిపోతున్నట్లుగా భావన.మేఘాల పందిరిలో పరుగులెడ్తున్నట్లు ఆలోచన!చిక్కడపల్లిలో ఓ పాతకాలం నాటి యిల్లు తమది.పెరటి వాటాలో తమ కాపురం!అన్నదమ్ముల లావాదేవీలలో పడి ఆయిల్లు చాలా కాలం అట్లాగే వుండి పోయింది.ఈ మధ్యనే ఎవరో బిల్డర్‌కు అప్పగించేరు.తొందరలో అపార్టుమెంటులు కడతారని యింటి గలవారు చెప్పారు.ఇంక యీ యింటికీ తమకూ రుణం తీరిపోతుంది.పెరటిలో వృక్షంలా పెరిగిన పారిజాతం!ఆ చెట్టు నీడలో కాసేపు నిలబడి పోయింది.పెరట్లో కూలిపోవడానికి సిద్ధంగా వున్న పాత పెంకుటి షెడ్డులో తమనివాసం.ఎప్పుడూ మూలిగే తల్లే!అనుక్షణం ఎవరినో వకరిని సతాయించే నాయనమ్మ!ఎప్పటికైనా సినిమా హీరోని కాకపోతానా అని విడుదల అయిన ప్రతీ సినిమాను చూస్తూ టెన్త్‌ రెండోసారి తప్పిన తమ్ముడూ.వీళ్ళందరినీ తప్పించుకొని కొంత కాలమయినా సేద తీరడానికి యీ పారిజాతపు నీడ ఒక్కటే తనకు శరణ్యం!