బైక్‌మీద కూర్చున్న మనోహర్ మనసు రెక్కలు విప్పుకున్న విహంగమై ఆకాశంలో విహరి స్తోంది. స్పైడర్‌మాన్ లాగా ఎగిరి వసంతసేన ముందు వాలాలని ఉర్రూత లూగుతున్నాడు.ఇంతలో సెల్ మోగింది. డిస్‌ప్లేలో వసంతసేన పేరు కనిపించి హుషారు ఎక్కువైంది.‘‘మేడమ్!’’‘‘టెర్రస్ పైకి వచ్చెయ్!’’ వసంతసేన మాటలు వేణువులో కరిగి వీణలో పులకించినట్టు లయ బద్ధంగా వినిపించాయి.‘‘అలాగే!’’బైక్ రేసు గుర్రంలా పరిగెత్తుతోంది. నిమిషాల్లో వసంత నిలయం గేటు ముందు ఆగింది. క్షణాల్లో గేటు తెరుచుకుంది.
బైక్ పార్కుచేసి టెర్రస్ పైకి వెళ్ళాడు.వసంతసేన అతన్ని చూసి మందహాసం చేసింది. లేత పసుపు రంగు డిజైనర్ చీరలో వెన్నెల్లో కలిసి పోయినట్టు కనిపిస్తోంది ఆమె. అందమైన పువ్వు లున్న పల్చటి జాకెట్‌లో ఎదఎత్తుల అందాల నుంచి చూపు మరల్చుకోవడం సాధ్యం కావడంలేదు అత నికి. వెన్నెల జల్లులో తటిల్లతలా మెరుస్తున్న ఆమె సౌందర్యాన్ని కళ్ళతోనే జుర్రుకుంటున్నాడు.పౌర్ణమి చందమామ వెండి వెన్నెల జల్లులు కురిపిస్తున్నాడు. ఆర్బీకి పాకిన మల్లెతీగల నుంచి విచ్చిన పువ్వుల సువాసన ముక్కులకు తాకి తన్మయం కలుగు తోంది అతనికి. రంగురంగుల రోజాలు, చామంతులు అతన్ని రారమ్మని ఆహ్వానం పలుకుతూ తలలూపు తున్నాయి.‘‘మనోహర్! ప్లీజ్‌కమ్. అక్కడే నిలబడిపోయావేం?’’ అన్నది వసంతసేన.
దివి నుంచి మేఘాలలో తేలుతూ టెర్రస్ మీద దిగిన అప్సరసలా ఉంది ఆమె. హెడ్‌బాత్ చేసిం దేమో, విరబోసుకున్న తుమ్మెద రంగు కురులు సము ద్రంలో కెరటాల్లా కదులుతున్నాయి. తాంబూలం సేవించినట్టుగా ఉన్న ఆమె ఎర్రటిపెదవుల మధ్య ముత్యాల్లా మెరుస్తోంది పలువరస.అద్భుతమైన అందం. అందానికే అందం. అజంతా సుందరిలా ఆమె సౌందర్యం ఎంతో ఆకర్షణీయం.మనోహర్ ముందుకు కదిలాడు. ఆమె హొయ లొలికే మందగమనంతో మయూరంలా ఎదు రొచ్చింది. అతని చేతిని అందుకుని డిన్నర్ టేబుల్ దగ్గరకు నడిపించింది. ఒంట్లోని రక్తం ఉరకలెత్తింది ఆమె స్పర్శతో. అతనిలో ప్రేమ పులకరిస్తోంది.‘‘మనోహర్! మూన్‌లైట్ డిన్నర్‌కి నిన్నెందుకు ఇన్వైట్ చేశానో తెలుసా?’’ అంటూ వసంతసేన ఓరగా చూసింది. బాదంకాయల్లాంటి ఆమె కళ్ళల్లో నుంచి దూసుకొచ్చిన చూపులు మన్మథుడి పూలబాణాల్లా అతని ఎదలో గుచ్చుకున్నాయి.