మాధురి నాలుగు రోజులుగా తొమ్మిదో నెంబరు మంచం మీద వున్న రోగిని గమనిస్తోంది.-లోలోపల నవ్వుకుంటాడు.అంతలోనే కడుపు నొప్పితో గిలగిలలాడిపోతాడు. హృదయవిదారకంగా ఏడుస్తాడు.డ్యూటీ డాక్టరు రెండు రోజుల్లో అతనికి ఆపరేషన్‌ చేస్తారని ప్రొద్దుట చెప్పేరు.మాధురి అక్కడున్న డ్యూటి నర్సుని అడిగింది ఆ రోగి గురించి.‘‘ఆ అబ్బాయా? దిక్కుమాలినోడు. అనాధ శరణాలయం వుందిగా. అక్కడ ఉండేవాడు. చెట్టుమీద నుండి దూకాడట. కడుపులో గాయం అయ్యింది. చూడ్డానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. మేమే బలవంతంగా పాలూ, అవీ యిస్తూ వుంటాము.’’మాధురి అంతకంటే వివరాలు అడగలేకపోయింది. స్టూడెంట్స్‌ అంటే మెడికల్‌ కాలేజీలో అందరికీ లోకువే!తమపైన హౌస్‌ సర్జన్లు, ఆపైనా పిజీ చేసే వాళ్ళు, ఇంకా పైన అసిస్టెంట్లు, అందరికీ పైన ఛీఫ్‌!వీళ్ళందరికీ స్టూడెంట్లంటే చాలా చులకన భావం!మెళ్ళో స్టెత్‌, వైట్‌ కోటు వేసుకుని తాము వార్డులోకి వెడితే కొందరు పళ్ళెటూళ్ళవాళ్ళు ‘‘డాక్టరమ్మా! ఓ సారి వచ్చి చూడరా’’ అంటారు.వెంటనే తాను చుట్టు పక్కలకి చూస్తుంది ఎవరైనా విన్నారేమోనని.అందులో మెడికల్‌ వార్డులో అసిస్టెంట్లు తమని చీమల్లాగానో దోమల్లాగానో చూస్తారు తప్ప ఇంకో రేండేళ్ళుపోతే బాధ్యతగల డాక్టర్లుగా తామూ మారుతామని వాళ్ళు అనుకోరు.

నర్సుల్లో హెడ్‌ నర్సుకి తాము మరీ అల్ప జీవులలా కనిపిస్తా.-తప్పదు!ఫైనలియర్‌ అయ్యేవరకూ ఓరిమి పట్టాలి.-బ్రతుకు బాటలో ఇంకా డక్కామొక్కీలు తినాలి. మాధురికి ఇంకా గుండె బండ బారలేదు.-గైనిక్‌ వార్డులో పని నేర్చుకొనేటప్పుడు ఓ గర్భిణికి కాన్పు కష్టమై చనిపోతే తాను రెండు రోజులు అన్నం తినలేకపోయింది.-శుభ్రంగా ఏ బియస్సీనో చేసి ఎమ్మెస్సీ చేసి లెక్చరర్‌గా చేరితే ప్రాణం హాయిగా వుండేదేమోనని అనుకుంటూ వుంటుంది అప్పుడప్పుడు.తన భావాలు పైకి ఎవ్వరికి చెప్పినా నవ్వుతారు. ఒక రజిని తప్ప!ర జినికి పట్టణంలో గల సేవా సంస్థలు చాలా వాటితో సంబంధం వుంది.అనాధాశ్రమానికి వెళ్ళి ఆదివారాలు వాళ్ళకి పాఠాలు చెప్పడం, వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడి వాళ్ళను మెడికల్‌ చెకప్‌కి తీసుకొని వెళ్ళటం వంటి పనులు చేస్తుంది.సాదాసీదా బట్టలతో కాలం గడిపేసి చేతిలో మిగిలిన డబ్బుని ఆ విధంగా ఖర్చుచేయటం రజనీకి అలవాటని అందరూ అనుకొంటారు.