ఔను... వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు.ఒకర్నొకరు తమకంగా చూసుకుంటూ, తన్మయత్వానికి లోనవుతూ-సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.క్యూట్‌ క్యూట్‌ లుక్స్‌తో ఆమె మెస్మరైజ్‌ చేస్తుంటే.... హాట్‌హాట్‌గా అతను ఎంజాయ్‌ చేస్తున్నాడు.ఒకే సోఫాని సగం సగం పంచుకుంటూ.... ‘స్వీట్‌ నథింగ్స్‌’తో ఆ ఇద్దరూ మునిగి తేలుతున్నారు.లోగొంతుతో మాటాడినా... గుండె చప్పుడు కూడా విన్పించేంత దగ్గరితనం అనుభవిస్తున్నారు.అయితే, వారి మనసులకీ, మాటలకీ వారధి కడుతున్నాయి వారి చేతుల్లోని ‘మొబైల్స్‌’అవును, వారిద్దరి దగ్గర ముద్దొచ్చే సెల్‌ఫోన్లున్నాయి.ఇంతకీ అతనెవరో కాదు... అందరికీ తెలిసిన మానినీ మానసచోరుడు మాధవన్‌.ఆమె కూడా అంతే! యూత్‌హార్ట్‌లపై కన్నేసి కాటుక కళ్లతో కాటేసి, కాట్‌వాక్‌ చేసేసే బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్‌.మోడ్రన్‌ లైఫ్‌స్టయిల్‌ని హృద్యంగా పోట్రయిట్‌ చేసినట్లున్న ఆ యాడ్‌ తెగ నచ్చిందతనికి.అతనూ మాధవుడే. చిత్రంగా అతని భార్య పేరూ విద్యే.‘ఎక్స్‌ప్రెస్‌ యువర్‌సెల్ఫ్‌’!‘‘ఒరేయ్‌...’’ ఓ తేనె చుక్కని చప్పరించిన వెంటనే గొంతు సవరించుకుని విష్‌ చేసినట్లుంటుంది ఫోన్‌లో విద్య పలకరిస్తే.మాటల మధ్యలో ప్రొవోక్‌ చేస్తూ హస్కీనెస్‌. చిన్నజీర. ఆమె స్వరం వింటే చాలు... పదునైన కత్తితో సన్నగా గుండెను కోస్తున్న ఫీలింగ్‌ మాధవ్‌కి. ఒక్కసారిగా ఉప్పెనలా నరనరాల్లో విద్యుత్‌ ప్రవాహం.

 ఆమె ఫోనొస్తే అతను ఉక్కిరిబిక్కిరవుతాడు. కుదురుగా ఓ క్షణం కూర్చోలేడు. వెర్రెత్తిన మోహావేశంలో తననితానే మరచిపోతాడు.ఇప్పుడూ అంతే!‘‘ఏం చేస్తున్నావురా?’’ గ్రీష్మతాపంలో తొలకరి చినుకులాంటి పలకరింపు.అతడు ఆన్సరిచ్చే లోపునే విద్య మళ్లీ అడిగింది- ‘‘నేనల్లిన ‘స్వీట్‌మెమోరిస్‌’ దిండుని హగ్‌ చేసు కుంటున్నావా?’’ నవ్వాడు మాధవ్‌.‘‘ఏడ్వలేక నవ్వినట్లుంది. హాయిగా నవ్వితే ఆస్తేంపోదు...’’ కొంటెగా టీజ్‌ చేస్తోంది విద్య. ఒకప్పటి కాలేజ్‌మేట్‌. ఇప్పటి సోల్‌మేట్‌. తొలిపరిచయం స్నేహమై, ప్రణయమై, పరిణయంగా పరిణతి చెందింది. ఒకనాటి ప్రేయసి కాస్తా పెళ్లాంగా ప్రమోషన్‌ కొట్టేసింది. దాంతో... మాధవ్‌ దగ్గర ఆమెకు బోల్డంత చనువు. అందుకే.... ఏమాత్రం తటపటాయింపులేకుండా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది.‘‘ఏం చెప్పనే నా బాధ. పక్క కుదరని లోన్లీనెస్‌. కన్రెప్పలెంత బలవంతంగా మూసినా నిద్ర రావట్లేదు. అడ్జస్టవలేక బెడ్‌పై అటూఇటూ దొర్లుతున్నాను...’’ విరహం వంటిని కాల్చేస్తుంటే తట్టు కోలేక అల్లాడిపోతున్న స్థితిని మాటల్లోకి అనువదించాడు మాధవ్‌.‘‘సారీరా...?’’‘‘ఇవాళ మన మారేజ్‌డే. అదీ మొట్టమొదటిది. రోజూ ఉండే కొలువే కదా... సెలవ్‌ పెట్టలేక పోయావు’’ బాధగా మాధవ్‌.‘‘నువ్వెందుకు లీవ్‌ పెట్టలేదురా?’’‘‘ఆడిటింగ్‌... కుదరలేదులే..’’ సన్నగా నసిగాడు మాధవ్‌.‘‘ఇక్కడా డిటోనే. ఇలాంటి రిగ్రెట్స్‌ ఉండకూడదనే... పెళ్లవగానే జాబ్‌ మానేస్తానన్నాను. ఆ ప్రపోజల్‌ పడనివ్వలేదు’’.మాధవ్‌ మరి సమాధానం చెప్పలేదు.‘‘నువ్వే కొన్నాళ్లు ఇద్దరం సంపాదిస్తే ఫైనాన్షియల్‌గా సెటిలవొచ్చు, ఫూచర్‌ బాగుంటుంది.. అన్నావు. ఔనా!’’