‘‘రేవంత్‌! నీదింత చీప్‌ మెంటాల్టీ అనుకోలేదు!’’ పూజ అతని వంక అసహ్యంగా చూస్తూ అంది!‘‘పూజ! షట్‌ యువర్‌ మౌత్‌! తప్పంతా నువ్వు చేసి!’’ అతనికి మాటని కట్‌ చేస్తూ,‘‘అంటే నీ దృష్టిలో నా కొలీగ్‌ నన్ను ఇంటి ముందు డ్రాప్‌ చేయడం తప్పా!’’ బయటఎంత వర్షంగా ఉందో చూసావా?’’‘‘ ఔను, నేనది భరించలేను! నువ్వు కావాలంటే ఆటోలో రా! నే పే చేస్తాను, అంతే కాని పరాయి మగాడు నిన్ను నా యింటి ముందు దింపి వెళ్లుతుంటే భరించగలిగే విశాల మనస్థత్వం నాకు లేదు!’’ కోపంగా అన్నాడు రేవంత్‌!‘‘ఛీ, ఛీ! ఎన్నేళ్లు గడిచినా మీ మగవాళ్ళు మారరు, ఎంత సంకుచిత ధోరణి!’’ ఛీత్కారంగా అంది పూజ!‘‘పూజ! నీ లిమిట్స్‌ క్రాస్‌ చేయకు? నేను నీకు చాలా లిబర్టీ ఇచ్చాను!’’‘‘నువ్విస్తే పుచ్చుకునేది స్వేచ్ఛ ఎలా అవుతుంది?’’ నీకు ముప్ఫై వేలు వస్తే, నేను ముప్ఫై వేలు సంపాదిస్తున్నాను! నువ్విచ్చేదేమిటి?’’రేవంత్‌ని పూజ సూటిగా అడిగిన ప్రశ్నకు వాళ్ల గొడవ అంతా హాళ్లో కూర్చుని వింటున్న శ్రీకాంత్‌రావుని ఆలోచనలో పడేసింది?? ఇది రోజూ ఉండే ‘గొడవే’ అనుకుంటూ అతని భార్య వంట పనిలో పడింది! కొడుకుది తప్పా, కోడలిది తప్పా అన్న వాదన పక్కన పెడితే, అసలు, వీళ్ళు ఒకరినొకరు ఎందుకు కట్టడి చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు? ఎవరి అధిపత్యం వాళ్ళు నిలుపుకోవాలని ఎందుకు యుద్ధానికి కాలుదువ్వుతున్నారు?

స్త్రీ, పురుషులు ఒకరినొకరు డామినేట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఎంత విలువైన సమయం చేజారిపోతోంది? ఎంత అందమైన జీవితం నిరర్థకంగా ముగిసిపోతోంది? అనాదిగా అణిచివేతకు గురైన స్త్రీకి ‘ఓర్పు’ తగ్గుతోంది! అనాదిగా అహంకారిగా నిలిచిన ‘పురుషుడి’కి ‘పట్టు’ కోసం పట్టుదల పెరుగుతోంది?శ్రీకాంత్‌రావుకి హఠాత్తుగా ఏన్నో ఏళ్ల క్రితం జరిగిన జ్ఞాపకాలు అలలుగా తోసుకువచ్చాయి!!! అతని కళ్ల ముందు రీలులుగా తిరిగాయి!!! బయట వర్షం ధారగా కురుస్తూనే ఉంది!!! ‘‘ఏమిటండీ, మరీ మౌనంగా కానిచ్చేస్తున్నారు?’’ శ్రీహరిరావు బిగ్గరగా నవ్వుతూ విస్కి గ్లాసు అందుకున్నాడు!‘‘అబ్బే, ఏం లేదు?’’ శ్రీకాంత్‌ చిన్నగా నవ్వుతూ అన్నాడు.‘‘తుఫానులా ఉంది? బయట వాతావరణం చూస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి! అప్పట్లో ఊళ్లు ఊళ్లు కొట్టుకుపోతే ఎంతో మంది మా ఇంట్లో మిద్దె ముందుకు చేరేవారు?’’‘‘అవునండీ! ఇంత వర్షం, ఇన్ని మెరుపులు నేనూ ఎన్నో ఏళ్ల తర్వాత చూస్తూన్నాను! సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే వాతావరణం, ఇన్ని మెరుపులు...’’ ఆగాడు శ్రీకాంత్‌!‘‘అరే, ఆగిపోయారే, చెప్పండి, ఈ రాత్రికి మనకీ కాస్త కాలక్షేపం అవ్వాలి కదా!’’ ఆసక్తిగా ముందుకు వంగాడు శ్రీహరిరావు!