నీఅంతు చూస్తాను.’’‘‘నీ వల్ల కాదు’’‘‘పెద్దంతరం, చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు’’‘‘.........................’’‘‘ఏంటా చూపు? మా అబ్బాయి నీ చుట్టూ తిరుగుతున్నాడని మురిసిపోకు. నువ్వు మా వాడితో కాపురం ఎలా చేస్తావో చూస్తాను.’’‘‘ఆ మాటనటానికి సిగ్గుండాలి’’‘‘అంటే నాకు సిగ్గు లేదనా’’నల్లజుట్టు పాత్రధారి హూంకరిస్తోంది.‘‘అంత సిగ్గున్నదానివయితే మా మామగారెవరో చెప.తెల్లజుట్టు పాత్రధారి నిలదీస్తోంది.ఇద్దరూ ఒడ్డూ పొడుగూ సమానంగానే వున్నారు. లావుకూడా అంతే.(సన్నగా వుంటే వెండితెర, లావయితే బుల్లితెర).మెడనిండా నగలు, పట్టు చీరలు, అత్తగారు స్లీవ్‌లెస్‌ జాకెట్టు, నల్లజుట్టూకోడలు పొడుగు చేతుల జాకెట్టు, తెల్లజుట్టు అదే వెరైటీ.పైన చెప్పిన విధంగా జుట్టురంగును బట్టి వరసలు నిర్ధారించవలసి వస్తోంది.ఇది టి.వి సీరియల్స్‌లో నడుస్తున్న ఎపిసోడ్‌.అప్పటివరకు కాళ్లు కిందబెట్టి కూర్చున్న కమలమ్మకు మోకాళ్ల నెపలు గుర్తొచ్చి కాళ్లు స్టూలు మీద పెట్టుకుని సోఫాలో వెనక్కి వాలిపో యింది.ఇది ఆవిడ అభిమానంగా చూసే సీరియల్‌. ఎన్నేళ్ల నుంచీ వస్తోందో గుర్తులేదు. బహుశా అమ్ములు (అంటే కూతురు) పెళ్లయిన కొత్తల్లో ప్రారంభమయినట్లు గుర్తు. అన్నట్లు అమ్ములు అత్తారింట్లో ఎట్లావుందో అని ఒక్క క్షణం అనిపించినా తెరమీద కనబడే అత్తాకోడళ్ల వివాదంలో మునిగిపోయింది.

ఇంతలో కాలింగ్‌బెల్‌ మోగింది. ఈ సీరియల్‌ వచ్చే టైంలో ఎవరొస్తారా అని ఊరుకుంది. అదీగాక ఎవరయినా వస్తే చికాకు కూడా కద్దు. అయినా బెల్‌ మోగటం ఆగకపోవటంతో ఇక తప్పదనుకుని లేచింది.తలుపు తీసిన ఆమెకు ‘‘బాగున్నారా అమ్మా’’ అంటూ అమ్ములు కనబడింది.తల్లినుంచి ఉలుకు పలుకు లేదు. ఎందుకంటే ఆవిడ టి.వి ముందు కూలబడింది.తెలిసిన ఇల్లే కావటంతో ఆ అమ్మాయే ఫ్రిజ్‌లో నీళ్లు తాగి స్థిమిత పడింది.సీరియల్‌ పూర్తయిన తర్వాత కమలమ్మ లేవబోయింది. అయితే కాళ్లు పైకెత్తి కూర్చోవడం వల్ల తిమ్మిరెక్కి అడుగు పడటం లేదు.‘‘ఏమిటమ్మా ఒంట్లో బాగుండడం లేదా’’‘‘ఒకటే మోకాళ్ల నొపలు’’‘‘డాక్టర్‌ దగ్గరకు వెళ్లావా’’‘‘ఎక్కడే కుదరటం లేదు’’అంత కుదరక పోవటానికి కారణం కూతురికి అంతు పట్టలేదు.‘‘నువ్వెపడూ ఇంతే. నీ గురించి పట్టించుకోవు’’ అన్నది అమ్ములు.కూతురి అభిమానానికి మురిసిసోయింది తల్లి. ఇద్దరూ కబుర్లలో పడిపోయారు.‘‘అతనేడే’’ అన్నది ఏదో గుర్తొచ్చినట్టుగా కమలమ్మ.అపడు గుర్తొచ్చింది కమలమ్మకు అల్లుడు రాలేదని.‘‘ఆయనకు శలవు దొరక లేదమ్మా’!‘‘నీతో రావటానికి శలవు దొరక్కపోవట మేమిటే మరీ విడ్డూరం కాకపోతే’’‘‘అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడా’’అమ్ములుకు నవ్వొచ్చింది. ఎందుకంటే భర్త తనను దగ్గరకు తీసుకున్నపడల్లా ‘‘బాగా చూసు కోవడమంటే ఇదే’’ అంటాడు.‘ఛీ ఫో అమ్మా’ అని ఈ కాలం పిల్లయినా సిగ్గుపడిపోయింది అది గుర్తొచ్చి.‘‘అత్తగారెట్లా వున్నారమ్మా’’‘‘ఆవిడకే ఈ మధ్య బొత్తిగా బావుండటం లేదు. మామగారు పోవటంతో ఇంకా డీలా పడిపోయారు. డాక్టరుకు చూపించి మందులు వాడుతున్నాం. అందులో నేనిక్కడికి వచ్చానేమో, ఆవిడకి ఇంకా ఇబ్బంది.’’