లో ప్లేన్‌ దిగగానే భర్త తనని చూసి షాక్‌ తినడు కదా!బాబు... శ్రీప్రియ ఏడుస్తారేమో అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు.అసలు అలా ఊడిన చర్మంతో దాదాపు నెల్లాళ్లు ఆస్పత్రిలో వుంది. అసలు బ్రతుకుతుందనుకోలేదు తను.ఆరోజు దుబాయ్‌లో ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక తన మొహం చూసి తనకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టు లేదు. మెడ, చెంప, ఆ వైపు చెయ్యి, కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా వున్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక ఫరవాలేదు.‘‘మేడమ్‌ ప్లేన్‌ ల్యాండవుతోంది... బెల్టు కట్టుకోండి’’.ఎయిర్‌హోస్టెస్‌ చిరునవ్వు నవ్వుతూ మృదువుగా తట్టి లేపింది. బిందు ఉలిక్కిపడింది.‘అరె ప్లేన్‌ ఎక్కిన దగ్గర్నుంచీ ఆలోచనలో పడిపోయిందన్నమాట. అందుకే అన్ని గంటల ప్రయాణం తెలియనే లేదు’.ఎయిర్‌పోర్ట్‌లో బిందుకళ్లు తన వాళ్లకోసం ఆత్రుతతో వెతికాయి.్‌్‌్‌అద్దం ముందు నిలబడి ఇయర్‌ హేంగింగ్స్‌ కలర్‌... కట్టుకున్న డ్రెస్‌కి మ్యాచ్‌ అయిందో లేదో చూసుకుంటోంది శ్రీప్రియ. అప్పటికి నాలుగు డ్రస్‌లు విప్పి కుర్చీలో పడేసింది. ముంగురులు నుదుటిమీద పడి రింగులు రింగులు తిరిగేలా ట్రై చేస్తుంటుంది కాసేపు. వేసుకున్న మోడ్రన్‌ డ్రస్‌కీ, ఆ హెయిర్‌ స్టయిల్‌కీ చక్కగా నప్పింది.‘‘ప్రియా పార్టీ ఏమయినా వుందా?’’ బిందు మంచం మీద పడుకుని తదేకంగా కూతురికేసి చూస్తూ అంది.

‘‘అవును అనిల్‌ బర్త్‌డే... మమ్మీ!’’ పది రోజులుగా అడిగినదానికి ముక్తసరిగా జవాబిస్తుంది తప్ప వివరంగా మాట్లాడదు ప్రియ.‘‘అనిల్‌ ఎవరు?’’‘‘అబ్బ నీకన్నీ ప్రశ్నలే మమ్మీ. అనిల్‌ నా బోయ్‌ ఫ్రెండ్‌’’ సున్నాలా మూతి చుట్టింది ప్రియ.ప్రియ మొహం మీదే నిలిచిపోయాయి హిమబిందు చూపులు. ఎంత అందంగా వుంది? ఇది అసలు తన కూతురేనా? చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ముత్యాల్లాంటి పలువరస. చక్కని శరీర సౌష్టవంతో ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెరిసిపోతోంది. అబ్బ తన దిష్టే తగులుతుందేమో! బలవంతాన చూపులు మరల్చుకుంది.తను వచ్చిన పదిహేను రోజుల్నుంచీ చూస్తోంది. రోజూ ఏదో ఒక పార్టీ పేరుతో ప్రియ రోజు మొత్తం బయటే వుంటుంది. అసలు కాలేజీకి ఎప్పుడు వెళ్తోంది? ఏం చదువుతోంది? ఎంతసేపు అలంకరణవైపే దృష్టి. లేత వయసులో ఆడపిల్లలకు దేహం మీద ఆకర్షణ సహజం. కాని చురుకైన పిల్లలకి అది మరీ ఎక్కువైతే కాస్త ప్రమాదమే. అందుకే కూతురికి కోపం వస్తే వచ్చింది అని అడిగింది బిందు... ‘‘ప్రియా! అన్నయ్య గాని డాడీగాని నీతో వస్తున్నారా?’’‘‘వాళ్ళెందుకు... అనిల్‌ నా ఫ్రెండ్‌’’.‘‘పోనీ నేను రానా?’’‘‘నువ్వా పార్టీకా?’’ బిగుసుకుపోయింది శ్రీప్రియ. అదీ ఒక్క క్షణమే - వెంటనే తేరుకుని ఆనేసింది ఖండితంగా.