‘‘ఏంటి బావా మరీనూ’’.మల్లెలు పరచిన పందిరిమంచం మీద ఒకవైపు ఒత్తిగిల్లి పడుకొని అగరొత్తుల పొగను ఆఘ్రాణిస్తూ తనవైపే చూస్తున్న ఈశ్వర్‌ని చూస్తూ అంది సుచరిత.అప్పటికే ఆమెకు కోపం నషాళానికి అంటుతోంది. ‘ఎన్ని ఆశలతో, ఎంత ఆవేశంగా తను ఈ గదిలోకి అడుగుపెట్టింది. తెల్లచీర కట్టి, తలలో మల్లెపూలు పెట్టి, రాని సిగ్గును నటిస్తూ లోపలికి వస్తే, కనీసం భుజాలచుట్టూ చేతులేసి బెడ్‌వైపు నడిపించలేదు.

కట్టిన చీరపరదా బరువుని తగ్గించి, బంధించిన జోడు మదనాశ్వాలకు కట్లు తెంచి, తనువనే రథమెక్కి, తపనల తీరం దాటి, సుఖసాగరంలో ఈదులాడి అలసిసొలసి సంతృప్తి ఒడ్డున ఆదమరచి నిద్రపోదామంటే ‘నా బావ ఇలా చేశాడేంటి?’‘పోనీ తనే చీరగీర పక్కనపెట్టేసి ‘బావా! నేనిక ఆగలేను...’ అంటూ అతడి మీదకు చేరిపోయి ఆవేశపడిపోదామంటే, మరీ మొదటిరాత్రే అలా చేయటం బాగోదు కదా అని ఆగిపోతోంది’.మొదటిరాత్రి కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టే పెళ్ళికూతురుని మొగుడు పట్టించుకోకపోతే ఏ ఆడపిల్లకైనా కోపమే కాదు రకరకాల అనుమానాలు కలిగి తీరుతాయి.అప్పుడే అతడు ఆమెవైపు తిరిగాడు. అదోలా నవ్వుతూనే ‘ఏమైందిప్పుడు?... అసలు నేనింకా ఏమీచేయకుండానే అలా అంటున్నావేంటి?’’ అడిగాడు.‘‘నేనూ అనేది అదే బావా! శోభనం గదిలోకి ఐదున్నర అడుగుల అందం అడుగుపెట్టి ఐదు నిమిషాలవుతున్నా ఇంకా అలా శేషపాన్పు మీద శ్రీమహావిష్ణువులా పడుకుండి పోయారేం?! కొంపదీసి సరసాలు, గిరసాలు, పాలగ్లాసు పక్కనపెట్టి నన్ను కాళ్ళు పట్టమంటావా ఏంటి?’’ అంది ఆమె కాస్త గారంగా, మరికాస్త నిష్టూరంగా.

‘‘కాళ్ళు పట్టమననుగానీ...’’ ఈశ్వర్‌ మంచం మీదనుండి లేచి, ఆమె ముందు వంగి నిలబడి భుజాల మీద చేతులేసి చెప్పాడు. ‘‘ఈ రాత్రంతా మనం కబుర్లు చెప్పుకుందాం’’.సుచరిత తన చెవులను తనే నమ్మలేకపోయింది. ‘ఏ పెళ్ళికొడుకైనా ఈ గడియ రాగానే, మొదట తలుపు గడియపెట్టి అరక్షణం ఆలస్యం చేయకుండా అమాంతం దగ్గరకు తీసుకుని ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ శోభనం గదిని స్వర్గలోకంగా మార్చేస్తాడు. మరి నా బావ ఇలా అంటున్నారంటే..’’ఆమె మనసులోని ఆలోచన గ్రహించినట్టు అతడు కంగారుగా అన్నాడు ‘‘అమ్మా...తల్లీ.. అంతకుమించి ఆలోచించకు. శోభనం గదిలో మొగుడు ముద్దుమురిపాలను వాయిదావేస్తే అనుమానం రావడం సహజమే గానీ, నా వాయిదా వెనుక అలాంటి అనుమానాలకు తావు లేదు..’’