మైథిలి... మత్తెక్కించిన పెద్దపెద్ద కళ్ళు, కోటేరు ముక్కు, విల్లులా వంగి కిక్కెక్కించిన అధరాలు, పొడవాటి మెడ, దానికింద జడ. ఇంకా చూపు మరల్చనీయని ఎదసంపద, ఉందా? లేదా? అన్నట్టు గగనంలో కుసుమంలాంటి సన్నని నడుము, మధ్యలో చూపు స్తంభింపజేసిన లోతైన నాభి, ఇంకొంచెం కింద పుష్టిగా కనిపించే జఘనం, కనిపించీ కనిపించనీయకుండా వీటన్నిటినీ దాచాలని ప్రయత్నించిన పద్ధతైన దుస్తులు.. అడుగు కదిపినప్పుడు ఎగిసిపడే ఆమె ఎదఅందాలు, పెదవి విప్పినప్పుడు జాలువారిన అధరసుధలు, గొంతు విప్పినప్పుడు కట్టిపడేసిన స్వర మధురిమలు, నడకలో ప్రతిధ్వనించిన హంసధ్వని రాగాలు.. ఒకటేమిటి? మొదటిసారి ఆమెని చూడగానే.... పోతపోసిన శిల్పంలాంటి ఆమె అందాలన్నీ మత్తుమందుచల్లి ఆకా్‌షని రెచ్చగొట్టి చూపు మరల్చనీయలేదు. ఆఫీసులో ఆమెను చూసిన తొలిక్షణమే అతని మనసు చిత్తుచిత్తయింది. ఉదయం తొమ్మిది దాటినా ఆకా్‌షలో అవే ఆలోచనలు. నిద్ర లేవకుండా బెడ్‌మీద దొర్లుతూనే ఉన్నాడు. ఆ రోజు ఆదివారం. హైదరాబాద్ పోచారం దగ్గరున్న టౌన్‌షి్‌పలో ప్రముఖ హీరో షూటింగ్ జరుగుతోంది.‘‘ఒరేయ్! ఆకాష్.. సూపర్‌స్టార్ షూటింగ్. రారా! వెళ్దాం. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్లు తీస్తున్నారట’’ రూమ్మేట్ సునీల్ అన్నాడు.‘‘షూటింగ్ ఏం చూస్తాం రా! బోర్. కావాలంటే నువ్వెళ్ళు’’‘‘నీ ఖర్మ... షూటింగు చూడటానికి అమ్మాయిలందరూ వచ్చారు. అందులో నువ్వెదికే ఆ... థిలి... మైథిలి.. ఉండొచ్చేమో!’’ అన్నాడు సునీల్.‘‘అయితే ఉండరాబాబూ! ఐదు నిమిషాల్లో వచ్చేస్తా!’’ అంటూ లేచి వేగంగా వాష్‌రూంలో దూరాడు ఆకాష్.
షాపింగ్ కాంప్లెక్సులున్న టౌన్‌షిప్ కూడలిలో ఎ.టి.ఎం. దగ్గర షూటింగ్ జరుగుతోంది. ప్రొడక్షన్ వ్యాన్లు, రిఫ్లెక్టర్లు, గొడుగులు, జనరేటర్లు, ట్రాలీ, క్రేన్లు, కెమెరా, అసిస్టెంట్లు, మేక్‌పకుర్రాళ్ళు.. షూటింగు వాతావరణంతో అంతా హడావిడిగా ఉంది. షూటింగ్ స్పాట్ చుట్టూ వలయంలా తాడు పట్టుకుని జనాన్ని కంట్రోలు చేస్తున్నారు సెక్యూరిటీ మనుషులు, పోలీసులు.హీరో హీరోయిన్లకి సీనుచెప్పి, మానిటర్‌ముందు కూచున్నాడు డైరెక్టరు. కెమెరామెన్ లైటింగ్ చూసుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ హీరోయిన్‌కి డైలాగ్స్ చెబుతున్నాడు. చిన్నషార్టు, పొట్టి టీ షర్టుతో ఫుల్‌మేక్‌పతో ఉన్న నార్తిండియన్ హీరోయిన్ అందాలపై చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్స్‌రే కళ్ళతో సెక్స్‌రేస్ పంపుతూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.డైరెక్టర్ మైక్ పట్టుకుని సైలెన్స్, రెడీ.. ‘క్లాప్’ అని అరిచాడు. క్లాప్‌బోయ్ క్లాప్ కొట్టాడు. ‘రెడీ కెమెరా... స్టార్ట్ యాక్షన్’ చెప్పాడు డైరెక్టర్. ఏటిఎం ముందు క్యూలో నిలబడ్డాడు హీరో. హీరోయిన్ ఏటిఎం లోపలికి వెళ్ళింది.‘‘ఒ.కే.... కట్’’ అరిచాడు డైరెక్టర్.లొకేషన్ మారుస్తున్నాడు కెమెరామెన్. కాలుమీద కాలేసుకుని గొడుగుకింద కూర్చున్న హీరోయిన్ ఇంగ్లీష్ నవలలో పేజీలు తిప్పుతోంది. చుట్టూ ఉన్న అబ్బాయిలంతా ఆమె అందాలతో కనువిందు చేసుకుంటున్నారు.