‘‘సురేష్‌ టైపింగ్‌’ అనే అక్షరాలు స్ర్కీన్‌మీద కనబడేసరికి ఫేస్‌బుక్‌లో చాట్‌ చేస్తున్న నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. మేటర్‌ ఏమైవుంటుందా? అని.’’స్వప్నా... గత ఆరు నెలలుగా ఎన్నో విషయాలు చర్చించుకున్నాం.మనసు విప్పి చాలా మాట్లాడుకున్నాం. యిష్టాయిష్టాలని నిక్కచ్చిగా చెప్పుకున్నాం. కొన్ని విషయాల్లో విభేదించినా అటువంటి సందర్భాలుచాలా తక్కువే. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామనే ధైర్యంతోనేఈ రోజు ఓ విషయం ప్రపోజ్‌ చేద్దామనుకుంటున్నా...’’ అంటూమెసేజ్‌ స్ర్కీన్‌ మీద ఫ్లాష్‌ అయ్యింది.నా గుండె జోరు ఎక్కువైంది. ఇంతకీ సురేష్‌ ఏం ప్రపోజ్‌ చేయదలచుకున్నాడు? ఏం జవాబివ్వాలో అర్థంకాక మౌనానికి సూచికగా ’’............................’’ అంటూ టైపు చేసి రిప్లయ్‌ కొట్టాను.‘‘స్వప్నా! ఇన్నాళ్ళ మన ఈ స్నేహాకి ఓ బంధంతో ముడివేసి మరింత దగ్గర ఎందుకు కాకూడదు? అదే....! మనిద్దరం వివాహబంధంతో ఎందుకు ఒకటి కాకూడదు....?’’ అంటూ సురేష్‌ నుండి వచ్చిన మెసేజ్‌కి నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఏం సమాధానం యివ్వాలీ? ఆఁ....అయినా ఏం సమాధానం యివ్వగలనూ? అంటూ నాకు నేను ప్రశ్నించుకున్నాను.

ఏదో రోజు ఇలాంటి పరిస్థితి తప్పక ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అయితే అనూహ్యంగా ఇంత తొందరగా అదీ ఈ రోజే కావడంతో చేష్టలుడిగిపోయాను. గొంతు తడారిపోయింది. కీ బోర్డు మీద వేళ్ళు వణుకు తున్నాయి. నాలో భయం కంటే బాధే నా మనసుని ఎక్కువ ఆవహించింది. ఫేస్‌బుక్‌ పరిచయంతో సురేష్‌ నన్ను ప్రపోజ్‌ చేయడం నా ఈ స్థితికి కారణం కాదు. అసలు కారణ మేంటంటే-ఇన్నాళ్ళూ ఫేస్‌బుక్కులో ‘స్వప్న’ పేరుతో స్నేహం చేసిన నా అసలు పేరు ‘సిద్ధు’... నూరు శాతం నవ యవ్వనంలో వున్న అసలు సిసలు మగాడ్ని!ఫఫఫతెలుగువారి జీవితంలోకి ఫేస్‌బుక్‌ అంతగా పరి చయం కాని రోజుల్లోనే నేను ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాను. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కావడంతో నిద్రలో తప్ప మిగతా సమయంలో కంప్యూర్తోనే సహజీవనం అలవాటైంది. ఆఫీసులో అయితే డెస్క్‌టాప్‌, ఇంట్లో అయితే లేప్‌టాప్‌తో కాలం కరిగించేయడం అలవాటైంది. అలాగని ఆఫీసు అవర్స్‌లో పని పక్కన పడేసి కంప్యూటర్తో ఆడుకునే మనస్థత్వం నాది కాదు. ప్రైవేట్‌ పను లన్నీ ఇంటి వద్దే చేసుకోవడం అలవాటు.