‘‘నో... నో. ఐ కాన్ట్‌ మారీ యూ!’’ - అంటూ కెవ్వున కేక పెట్టింది. రజని నిద్దట్లో‘‘ఏయ్‌! రజనీ!... ఏమిటా పిచ్చికేకలు? కలేమన్నా వచ్చిందా?’’ అంటూ లైట్‌ ఆన్‌చేసి, రజనీని పట్టుకొని కుదిపేసింది వనజ!‘‘అమ్మో!’’ అంటూ, వణికిపోతూ గభాల్న లేచేసింది రజని!‘‘ఏమిటి? అలా వణికిపోతున్నావ్‌? ఏమిటా వెర్రిచూపులు? నిద్దట్లో ఏమిటా అరుపులు? ముందు ఈ మంచినీళ్ళు తాగు! ఫ్యాను తిరుగుతున్నా, నీకా చెమట్లేమిటే? రమేష్‌ కల్లోకొచ్చాడా?’’‘‘అవునే... చాలా భయంకరంగా ఉన్నాడు! చిక్కిశల్యమై గిలగిలా కొట్టుకుంటున్నాడు. నేనా బాధను చూడలేకపోయాను, వనజా! ఇంతలో - ఒక్క గావుకేక పెట్టేసి, తల వాల్చేశాడు’’ - అంటూ భయంతో భోరున ఏడ్వసాగింది.‘‘ఊర్కో... ఊర్కో!! ఆశ్చర్యంగా ఉందే... అయినా, నీ కిలాంటి కలెందుకొచ్చిందే?’’ ఈ మధ్యేమన్నా జరిగిందా? రమేష్‌కు, నీకు ఏమన్నా తేడాలొచ్చాయా? చెప్పవే!’’ఫఫఫ‘‘ఏంటి రమేష్‌! ఇంత లేటు?’’ చిరుకోపంతో అడిగింది రజని!రమేష్‌ మాట్లాడలేదు. 

ముభావంగా, దిగులుగా వచ్చి రజని పక్కనే కూర్చున్నాడు, పార్కులో!‘‘ఏంటి రమేష్‌? ఏంటలా ఉన్నావ్‌ ఒంట్లో బాగాలేదా?’’రమేష్‌తల పైకెత్తి, బేలగా చూశాడు, రజని కేసి!‘‘ఏంటి రమేష్‌..! ఏంటలా ఉన్నావ్‌ ? ఇంకొద్ది రోజుల్లో నిశ్చితార్థం జరగబోతుంటే ఎంతో ఆనం దంగా ఉండాల్సిందిపోయి, యిలా కన్నీళ్ళు కారి పోతున్నాయేంటి?’’‘‘అదే... అదే... రజనీ... అదే నా బాధ!’’‘‘ఏంటి? ఏంటంటున్నావ్‌... బాధా...? ఏంటి నువ్వనేది? ఎందుకలా అంటున్నావ్‌?’’‘‘ఏం చెప్పను రజనీ... ఏం చెప్పను... నీ జీవితం నాశనమవడం నాకిష్టం లేదు’’ బాధతో అన్నాడు.‘‘ఏంటి? వాడ్డూయూమీన్‌... నా జీవితం నాశనమవడమా?... ఏం మాట్లాడుతున్నావ్‌? పిచ్చి గాని ఎక్కలేదు కదా?... నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పు రమేష్‌’’‘‘ఏం చెప్పను రజనీ... ఏం చెప్పను? ఎలా చెప్పను? నాకు... నాకు... క్యాన్సరు. కిడ్నీకి’’రజని హృదయంలో అగ్నిపర్వతం బ్రద్ధ లైనట్లయింది. నీరు తడారిపోయింది. నిలువు గుడ్లేసి, రమేష్‌కేసి వెర్రిగా చూస్తూ ‘‘నో... నో అదంతా అబద్ధం... వట్టి ట్రాష్‌! నేన్నమ్మను... చెప్పు రమేష్‌ చెప్పు’’ అంటూ అతన్ని పట్టుకొని ఊపేసింది రజని!