అపశ్రుతులు మీటుతున్నారు..’’ వీణ మీటుతున్న చిరంజీవి మాష్టార్ని అడిగాడు శేఖర్‌.‘‘తీగలు సరిగా సవరించలేదు...’’ తడబడుతూ ఒదిగిపోయాడు చిరంజీవి మాష్టారు.‘‘సరిచేసి మీటండి...’’ అంటూ మేడ మెట్లు దిగి క్రిందికి వెళ్ళిపోయాడు శేఖర్‌.మంజరి మనసులో కోరిక బుసలు కొట్టింది. ఆమెను చూస్తున్న చిరంజీవి మాస్టారిలో ఏదో అలజడి.‘‘ఈ వాళ్లకీ పాఠాలు చాలు...’’ వణికిపోతూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు చిరంజీవి మాష్టారు.చిరంజీవి బిగి కౌగిలి అనుభూతి నుండి కొంతసేపటి వరకు తెములుకోలేక పోయింది మంజరి. మంజరిలో రానురాను పెరుగుతున్న ఉద్రేకం, తాపం ఆమెను వివశురాలిని చేస్తోంది. ఆమెలోని తాపం ఉద్రేకరూపం దాలుస్తోంది. ఆమెనలా బాధించడమే శేఖర్‌ కోరిక. మంజరి అలా అశాంతితో బాధపడుతూనే ఉంటే ఆమెకు పిచ్చిపట్టిందని లోకానికి చెప్పవచ్చు. అలానే ఆమె కృశించి నశిస్తే మంజరి కోట్ల ఆస్తికి తాను వారసుడు కాగలననే దురాశ శేఖరానికి ఉంది.తల్లిదండ్రులు చనిపోవడంతో మంజరి అనాథ అయింది.‘‘మనది రాజవంశం. వంశ గౌరవానికి వ్యతిరేకంగా మన ఇంటి ఆడపడుచులు వీధిలోకి పోకూ డదు..’’ అంటూ మంజరిని బంగారు పంజరం వంటి భవనంలో బంధించి తన మనుషులను కాపలా పెట్టాడు శేఖరం.ప్రపంచమంతా అత్యాధునిక నాగరికత అలముకున్నా ఇంకా ఈ రాజుల మూఢ నమ్మకాల సంకెళ్లు వదలని బానిస బతుకులోనే మగ్గుతోంది మంజరి. కోట్ల ఆస్తికి వారసురాలైన మంజరి మాటవిన్నట్లే నటిస్తూ ఆమె చేత సంతకాలు, పనులు మంచిగా చేయించుకుంటూ ఉన్నాడు శేఖరం. అప్పటికే లోకం దృష్టిలో మంజరి మతిచలించిన అమ్మాయి. ఆమెనలానే ఉంచాలి అంటాడు శేఖరం. ఇలా మంజరి స్వేచ్ఛకు సంకెళ్లు వేసి పంజరంలోని పక్షిని చేశాడు.కాలం గడిచేకొద్దీ మంజరిలో ఏవో కోరికలు, మనస్థాపం రేగడం ప్రారంభించింది.

వీణ నేర్పించ వచ్చే చిరంజీవి మాష్టారిని చూస్తే చాలు మంజరి వివశురాలు అవుతోంది. ఆమెలో నిద్రాణమై ఉన్న కోరికలు బుసలు కొడుతుంటాయి. మంజరిని చూస్తున్నప్పుడు చిరంజీవిమాస్టారి కళ్లలో కోరికలు బుసలు కొడుతుంటాయి. ఎవరూలేని ఏకాంతంలో ఓసారి చిరంజీవి మాష్టారు బిగి కౌగిలిలో బంధించాడు. అప్పుడు తెలిసింది మంజరికి శరీరానికి మరోశరీరం తాకితే ఆ అనుభూతే వేరని. అప్పటి నుండే తనలో నిద్రాణమై ఉన్న కోరికలను అదుపు చేయలేక పోతోంది. సమయం అర్ధరాత్రి దాటింది. నిద్ర పట్టక పక్కపై నుండి లేచి టెర్రస్‌ మీదకు వెళ్లింది మంజరి.చిరాగ్గా అటూ ఇటూ తిరుగుతున్న మంజరికి తానున్న భవనానికి కొద్దిదూరంలో చీకటిలో చిరు మంట కనిపించింది. ఆ మంట ముందు ఓవ్యక్తి కూర్చుని చలికాచుకుంటున్నాడు. కండలు తిరిగిన అతని శరీరం చమటలు పట్టి మెరుస్తూంది. అతడిని చూడగానే మంజరి మనసులో తీయని మంటలు రేగాయి. అతని బిగికౌగిలి లో కరిగిపోవాలనిపించింది.. ఎలా? చప్పుడైతే కాపలాదారు ఒక పక్క.., కుక్క మరో పక్క. తను అభాసుపాలు అవుతుంది. గదిలోకి పోయి ఫ్రిజ్‌లోని ఐస్‌ ముక్కలు కొన్ని ట్రేలో వేసుకొని తెచ్చింది. ఓ ఐస్‌ ముక్క బలంగా మంట ముందు కూర్చున్న వ్యక్తి మీదకు విసిరింది. సరిగ్గా గుండె గుభిల్లిన తగిలిన ఐస్‌ముక్క దెబ్బకు తుళ్లిపడి అది వచ్చిన దిశకేసి చూశాడతను. ఎదురుగా మేడ మీద నీలిరంగు డిమ్‌లైట్‌ కాంతిలో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించింది మంజరి.