మరోసారి టైం చూసుకొన్నాడు రవి.‘‘ఎనిమిది గంటల నలభై నిమిషాలు’’అప్పటికే తను మియాపూర్ బస్టాపుకొచ్చి ఇరవైనిమిషాలవుతోంది.పది గంటలకల్లా ఆఫీసులో వుండాలి. లేకపోతే ఈ రోజు కూడా ‘లేట్ మార్క్’ పడుతుంది అటెండెన్స్ రిజిస్టరులోఅప్పటికే మూడు బస్సులు వదిలేసాడు. జనం ఫుట్‌బోర్డు మీద వేళ్లాడుతుండడం వల్ల.ఆఫీస్ అవర్స్‌లో బస్సులు ఎక్కువగా వేస్తే, కనీసం కొన్ని బిజీరూట్లలోనైనా...వీళ్ల సొమ్మేం పోయిందో? ఆర్టీసి అధికారులను మనసులోనే తిట్టుకున్నాడు.ఒకసారి చుట్టూ కలియజూసాడు. రాను రాను జనం మరింత ఎక్కువవుతున్నారు. లాభం లేదు. వచ్చే బస్సులో ఎలాగైనా సరే ఎక్కాలి.దూరం నుండి బస్సు వస్తోంది. ఏదో ఆర్టీసి బస్సులా వుంది. కళ్లు చికిలించి చూసాడు.
సందేహం లేదు. అది పటాన్ చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే బస్సు. రూట్ నెంబర్ ‘‘రెండు వందల ఇరవై అయిదు డి’’ వీరా బస్సు.యుద్ధానికి వెళ్లే సైనికుడిలా తయారయ్యాడు రవి.బస్సు దుమ్ము రేపుకుంటూ,(అది తారు రోడ్డయినా...మరి మన తారు రోడ్లు కరప్షన్‌తో తగలడ్డాయి) వచ్చి బస్టాప్ కంటె కొంచెం ముందుకెళ్లి ఆగింది. సిటీ పక్షులకిది అల వాటే కదా!రవి ఎగురుతూ సారీ పరుగెత్తుకుంటూ, బస్సు దగ్గరికెళ్లాడు. రవితో పాటే మరి కొన్ని పక్షులు రన్నింగ్ రేస్ చేసాయి.బస్సు నిండా జనం. ఒకరిని పట్టుకొని ఒకరు వేళ్లాడుతూనే వున్నారు.అయినా తప్పదు. అందరినీ తోసుకుంటూ పద్మవ్యూహంలో జొరబడ్డ వీరాభిమన్యుడిలా బస్సులో ఎక్కి విజయగర్వంతో నిండిన వీరునిలా ఫీలయ్యాడు రవి.ముందు డోర్ నుంచి లేడీస్ ఎక్కేసినట్టున్నారు. డ్రైవర్ బస్సుని స్టార్ట్ చేసాడు. వెనక డోర్ నుంచి ఎక్కేవారు ఎక్కుతూనే వున్నారు.పురుడు పోసుకునేందుకు నిండుచూలాలు ఆస్పత్రికి వెళుతున్నట్లుగా బయలుదేరింది బస్సు.ఎక్కలేని వారు దిగాలు ముఖాలేసుకొని అక్కడే నిల్చుండిపోయారు.్‌్‌్‘‘టికెట్ ప్లీజ్’’‘‘సికింద్రాబాద్ స్టేషన్’’అందరూ అతని వైపు చూసారు. రవి కూడా అతని వైపు చూసాడు. చదువుకున్న వాడిలాగానే కనిపిస్తున్నాడు. బహుశా సిటీకి కొత్త అనుకుంటా!‘‘సికింద్రాబాద్ పోదండి. ఇది దిల్‌సుక్‌నగర్ వెళ్లే బస్సు’’‘‘అయ్యో తెలియకుండా ఎక్కాను. బస్సాపితే దిగిపోతాను’’‘‘తెలియకపోతే ఎవరినన్నా అడిగి ఎక్కాలి.
అంతే గాని బస్సు వచ్చింది కదా అని ఎక్కేస్తే ఎలా...’’ కండక్టర్ విసుక్కున్నాడు.‘‘సారీ... ఆపితే దిగిపోతాను’’కండక్టర్‌ని వేడుకున్నాడు.ఒక్కసారి పద్మవ్యూహంలోకి జొరబడి తిరిగి వెనక్కి వెళ్లాలంటే ఎంత కష్టం... అది అసంభవం. సిటీ ఆర్టీసి బస్సులో కూడా అంతే.ఆ మనిషి ఎలా దిగుతాడా అని చూస్తున్నాడు రవి.కూకట్‌పల్లి వరకూ టికెట్ తీసుకోండి. అక్కడ దిగి సికింద్రాబాదు పోయే బస్సెక్కండి అంటూ డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చాడు కండక్టర్ బస్సునాపకుండా.‘‘టికెట్ ప్లీజ్’’‘‘అమీర్‌పేటొకటివ్వండి’’ వందరూపాయల నోటు తీసిచ్చాడు రవి పక్కనున్నతను.