సదానందానికి జ్యోతిషం మీద నమ్మకం ఎక్కువ. అతను జాతకాలను సంపాదనప్రతాప రవిబాగా నమ్ముతాడు. అతని బంధువర్గంలో ఒకాయన జాతకాలు గీసి భవిష్యత్తును చెప్పేవాడు. ఆయనే సదానందం ఇంకో ఏడాదికి పుడతాడనగా అతని అన్నయ్య విశ్వనాధం జాతక చక్రం గీసి అతను నలభైయేళ్ళు దాటుతున్నప్పుడు ఒక యక్సిడెంటులో చనిపోతాడని చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు.కానీ వూహించని విధంగా విశ్వనాధానికి నలభైయేడు దాటుతుండగా ఎక్కడినించో స్నేహితుడి మోటారుసైకిలు మీద వస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న లారీ గుద్ది స్నేహితుడితోపాటు విశ్వనాధం కూడా చనిపోయాడు. అప్పుడు సదానందానికి ముప్పయినాలుగేళ్లు.ఈ సంఘటన జరిగిన తర్వాత సదానందానికి జాతకాల మీద నమ్మకం, విశ్వాసం బాగా పెరిగాయి. అందువల్లనే ఎవరయినా జ్యోతిష శాస్త్ర పండితుడి గురించి తెలిసినప్పుడు ఆయన దగ్గర తన జాతక చక్రం గీయించి తన భవిష్యత్తును తెలుసుకోవడం మొదలుపెట్టాడు.ఇప్పుడు సదానందానికి యాభైయేళ్లు. అతను ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకసారి సదానందం తన మిత్రుడు ఈశ్వర్‌తో కలిసి అతని పెద్ద కూతురి పెళ్లి సంబంధం గురించి గుంటూరు వెళ్లాడు. వాళ్లిద్దరూ రోడ్డు మీద వెళుతున్నప్పుడదు రోడ్డు పక్కగా ఒక పెంకుటింటి ముందు ఏదో పేరుతో జ్యోతిషాలయం అనే బోర్డు కనిపించింది. వచ్చిన పని చూసుకుని తిరిగి వెళుతూ ఆ జ్యోతిషాలయ సిద్ధాంతిని కలవాలని అనుకున్నాడు సదానందం.సదానందం తను కలవాల్సిన మనిషిని కలిసి కావలసిన వివరాలు తెలుసుకున్నాడు.

ఈశ్వర్‌తో కలిసి భోజనం వేళ కావడంతో అక్కడకు దగ్గరలో వున్న హోటల్లో భోజనం ముగించి వెనక్కు మళ్లాడు.తిరిగి వస్తూ ఆ రోడ్డు పక్కనే వున్న జ్యోతిషాలయం ఇంటి ముందు ఆగి ఓసారి ఆ ఇంటిని చూశాడు.చాలా పురాతనమయిన పెంకుటిల్లు. చెక్కగేటు ఎదురుగా నిలబడితే లోపలి హాలు, గోడ పక్కగా చెక్కటేబులు, దాని వెనుక కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్న ముసలాయనా స్పష్టంగా కనిపించారు.‘‘నా భవిష్యత్తు మరోసారి తెలుసుకోవాలని వుంది’’ అన్నాడు సదానందం.ఈశ్వర్‌ నవ్వి ‘‘అలవాటేగా... పద’’ అన్నాడు సదానందం గురించి తెలుసు కాబట్టి.చెక్కగేటు నెట్టుకుని ఇద్దరూ లోపలకు వెళ్లారు.ఆయన పేరు సోమనాధ సిద్ధాంతి అని బోర్డు మీద రాసివుంది.ఇద్దరూ నమస్కారం చేసి టేబులు పక్కనే వున్న కొంచెం పొడవాటి చెక్క బెంచీ మీద కూర్చున్నారు.సోమనాధ సిద్ధాంతి నవ్వి ‘‘ఇద్దరి జాతక చక్రాలు వెయ్యాలా?’’ అని అడిగాడు.అప్పుడు సదానందం ‘‘నా పేరు సదానందం. ఒక పని మీద విజయవాడ నించి వచ్చాము. ఇతను నా మిత్రుడు విశ్వనాధం. నా ఒక్కడి జాతక చక్రం వేస్తే సరిపోతుంది. ఇంతకీ మీరు ఫీజు ఎంత తీసుకుంటారు?’’ అనడిగాడు.