‘‘ట్రింగ్‌గ్‌గ్‌...’’అలారం చపడు చెవులగుండా పాకి గుండెల మీద దభీదభీమని జారుతున్నట్లుగా అన్పిస్తూ వినిపించడంతో దిగ్గున లేచి కూర్చుని కళ్లు నులుముకొని చూసింది శ్రీలకీ్క్ష.ఆరు గంటలు!! ‘‘అమ్మో... అపుడే ఆరయ్యిందా? ఇక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు!’’ అనుకుంటూ గబగబా లేచి కిచెన్‌లోకి పరిగెత్తింది. రెండే రెండు నిమిషాల్లో బెడ్‌కాఫీ తయారు చేసుకొచ్చి బెడ్రూంలోకి రయ్‌న జొరబడింది. నిండా దుప్పటి ముసుగేసుకొని పడుకున్న భర్తను చూసి చేతిలోని కాఫీ కపను పక్కన బెట్టి-బకెట్లో బట్టలు జాడించినట్లు తట్టి(కొట్టి) లేపింది.‘‘ఏవండీ... లేవండి త్వరగా! ఆఫీసుకి టైమవుతోంది. లేచి రెడీ అవ్వండీ!’’ అని దీర్ఘాలు తీస్తూ కపకున్న దుప్పటిని లాగేసింది.నిద్రమత్తో, రాత్రి మత్తో... అదింకా వదల్లేదా పురుషపుంగవుడికి. ఇటు నుంచి అటు తిరిగి పడుకుంటూ ‘ప్లీజ్‌ లకీ్క్ష ఈరోజెందుకో ఒంట్లో బాలేదు. ఆఫీసుకి వెళ్లాలన్పించట్లేదు. లీవు పెట్టేస్తాను. కాసేపు పడుకోనీ నన్ను!’’ అన్నాడు మత్తుమత్తుగా.‘‘ఏమిటీ... ఆఫీసుకి వెళ్లరా??’’ కొంపలు మునిగినట్లుగా గాబరాపడుతూ అరిచింది.‘‘అబ్బా... అంత గట్టిగా అరవకే... దడుచుకొని ఛస్తాను. వెళ్లి నీ పనిచూసుకో! నా జోలికి రాకు.... పడుకోని నన్ను!’’ విసుగ్గా అన్నాడు.శ్రీలకీ్క్ష ఏదో గుర్తొచ్చినట్లుగా నెమ్మదిగా అతడి పక్కకు చేరి గొంతు తగ్గించి అతడి చెవిలో... ‘‘మా వారూ బంగారు కొండా... త్వరగా ఆఫీసుకి బయల్దేర్తారు కదా...’’ అంటూ ఏదో సినిమాలోని పాటని రాగం తీస్తూ మార్చి పాడింది.‘‘ఉహూ...నే వెళ్లను లకీ్క్ష!’’ మారాం చేస్తున్నట్లుగా గారాలు పోతూ అన్నాడు.‘‘అలాగంటే ఎలాగండీ.... ఒంట్లో బాగానే వుంది కదా!

 ప్లీజ్‌...నా మాట వినండి! రేపెట్లాగూ ఆదివారమేగా...ఇంటిపట్టునే వుండొచ్చు. మా శ్రీవారు చాలా మంచివారు కదా...నే చెప్పిన మాట వింటారు కదా...ప్లీజ్‌ లేవండీ టైమవుతోందీ!’’ అతడి గడ్డం పట్టుకొని బుజ్జగించే ధోరణిలో అంది.‘‘ఆదివారమైతే మాత్రం ఏం ప్రయోజనం? ఆ దిక్కుమాలిన ఛానెల్స్‌లో ‘ఆదివారం స్పెషల్‌ ప్రోగ్రాం’ అంటూ రోజంతా టీవీ ముందే కూర్చుం టావ్‌... కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకునే తీరిక నీకు దొరకదాయే! ఏంటో భార్యాభర్తలుగా ఒకే గూటి కింద కాపురం చేస్తున్నామే కానీ మనం మనసులు విప్పి మాట్లాడుకునే టైమే దొరకడం లేదు. ఏది ఏమైనా సరే... ఈ రోజు ఆఫీసుకెళ్లను. పగలంతా నీతోనే గడుపుతాను. సాయంత్రం ఏ సినిమాకో... షికారుకో... సరేనా? ప్లీజ్‌... నా ముద్దుల శ్రీమతివి కదూ...వెళ్లనీయకూ...నను వెళ్లనీయకూ!’’ తనూ ప్రాధేయపూర్వకంగా అడిగాడు లేచి కూర్చుని...శ్రీలకీ్క్షలో దిగులు, ఆరాటం, ఆత్రుత, టెన్షన్‌... పెట్రోల్‌ డీజిల్‌ రేట్లలా క్షణక్షణానికి పెరిగిపోతున్నాయ్‌. ‘వంట చెయ్యాలి, ఇల్లూడవాలి, బట్టలుతకాలి, ఆపై... అమ్మో... ఈయన ఆఫీసుకి వెళ్లకపోతే ఎలా? కుదరదు’’