‘‘ముద్దు పెట్టుకున్నా... ముచ్చటగా ఉండాలిగాని, మొరటుగా ఉండ కూడదు సిద్ధూ!...’’ అంది తన మీదకి ఎగబ్రాకుతూ కసుక్కున క్రింద పెదవిని అందుకుని కొరికిన సిద్ధార్థతో.‘‘నువ్వు బింబోష్టివి... అంటే ఎర్రటి పెదాలు కలదానివి... వేయి మందిలో ఏ ఒక్కరికో గాని ఇటు వంటి పెదవులుండవు. అది ఏ భర్తకో అదృష్టం కొద్దీ లభిస్తాయి...’’ మరోసారి తన పెదవులతో కలిపాడు సిద్ధార్థ.జివ్వున నరాలు లాగాయి అరవిందకు. ఒళ్ళంతా సవరదీస్తున్నట్టుగా అనిపించి తమకంతో అల్లుకు పోయింది. అతని బాహు యుగళి ఆమె పాలిట కౌగిలిగా మారింది.సిద్ధార్థ ఏమేమో చేసేస్తుంటే ఆమె ఏమేమో అయిపోతోంది. ఎవరికీ అందని అనుభవాలు ఆమె మాత్రమే అందుకుంటున్నట్లుగా భావించి పులకించి పోతోంది.ఊరించే నాభి మీంచి చేయి జారి సైకత తీరంలాటి పలుచటి పొట్ట దిగువ కుచ్చెళ్ళ చాటున చేరగా.‘‘ఇదిగో సిద్ధూ... నువ్వు నన్ను చంపేస్తున్నావు...’’ ఇంకా ఆరని మంట, తీరని దాహం సిద్ధార్థను కరచుకుపోయేలా చేస్తున్నాయి.‘‘సిద్ధూ! సిద్ధూ...! నన్ను... నన్ను...’’ ఒక్కసారి ఉలిక్కిపడింది అరవింద. బంగారం లాంటి ఊహ చెల్లచెదురైంది.కలలోని అద్భుతమైన ఆ ఆనుభవం నిజంగా ఎదురైతే.... ఎంతో అమోఘం. కాని, ఆ అనుభవం రాను రానంటూ దూరంగా జరిగిపోతోంది.ముహూర్తాల పేరుతో కొంతకాలం నానుస్తూ వచ్చారు. మరి కొంతకాలం సిద్ధార్థ సెలవుల్లేని కారణాలు. ప్రస్తుతం ముహూర్తమూ కుదిరింది. 

సెలవులు దొరికాయి.ఇంక భార్యాభర్తలిరువురూ పడక గదిలోకి ప్రవేశించే శుభ తరుణం ఆసన్నమైందని కొండంత ఆశతో నిరీక్షిస్తూంటే పానకంలో పుడకలా సుందరమ్మ...!?అయినా ఈ సుందరమ్మ ఎవరని...? అసలీవిడగారి పెత్తనం ఏమిటంట...? తన శోభనానికి ఈవిడగారు రాకుంటే ఆగిపోవటమా!?వీళ్ళంతా ఎందుకింత ప్రాధాన్యం యిస్తున్నారని...? కసిగా అనుకుంది అరవింద.కూతురు అరవింద అవస్థచూసిన రమణమ్మ... ‘‘నీకు తెలీదే పిల్లా సుందరమ్మ గురించి...’’ నువ్వుతూ అన్నది.‘‘సుందరమ్మ లేకుంటే ముహూర్తాలేనా ఆపుకుంటారుగాని ఆమె హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే..’’ అన్నది అరవింద పిన తల్లి భార్గవి.వారి మాటల్లో బయటపడ్డ వివరాలేమంటే...సుందరమ్మకు ‘శోభనాల స్పెషలిస్టు’ అని పేరుట. ఎక్కడ పెళ్ళి జరిగినా, శోభనం ముహూర్తానికి ఆమెకు కబురు వెళ్తుంది. అప్పుడామె వచ్చి తన కళా నైపుణ్యం అంతా ఉపయోగించి మరీ పడకటింటిని శోభాయమానంగా, స్వర్గధామంగా తీర్చిదిద్దుతుంది.ఒకప్పుడు సుందరమ్మ భర్త సన్యాసుల్లో కలసి పోయాడట. దిక్కు మొక్కులేని ఆమెను అందరూ తమ బంధువుగా ఆదరించారట. పెళ్ళిపనులన్నీ సమర్థవంతంగా చక్కబెడుతుందని పేరొచ్చింది. అయితే ఎలా మొదలైందో గాని శోభనం గది అలంకరణ కూడా మొదలెట్టింది. అప్పటి నుండీ అందరూ సుందరమ్మనే పిలిచే వారు.అవతలి వారి అవసరాలను కనిపెట్టి డబ్బు పిండే రకం కాదు సుందరమ్మ. రంగం అంతా సిద్ధం చేశాకనే వారిచ్చింది తీసుకునేది.