ష్‌...కోపం, భయం, అసహనం కలగలిసిన గొంతుతో శబ్దం చేశాడు గోడమీద కనిపిస్తోన్న బల్లిని చూసి సంఘమిత్ర. ఆ బల్లి అతని అరుపునకు గోడకు అతుక్కుపోయింది, అచ్చు బ...ల్లి...లా...నే!సంఘమిత్ర మొహమంతా చెమట. అతనిపడు వాం...ప...యి...ర్‌ హౌస్‌లో ఉన్నాడు.సిటీకి నూట ముప్పయి కిలోమీటర్ల దూరంలో వున్న దట్టమైన అడవి మధ్యలో ప్రపంచానికి తెలియని అతి శిథిలమైన వాంపయిర్‌ హౌస్‌ అది.మూడు వందల సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒక మంత్రగాడు స్వయంగా నిర్మించుకున్న ‘‘వాం...ప...యి...ర్‌ హౌస్‌...’’ అది. అతని నాసికా పుటాలకు గబ్బిలాల వాసన తగులుతోంది. రిస్ట్‌వాచీ వంక చూడ్డానికి కూడా భయపడుతున్నాడు. పట్టపగలు చీకటిగా వుండే ఆ శిథిల భవనంలో, అర్థరాత్రయితే వేరే చెప్పాలా...క్యాండిల్‌ వెలుతురులో పన్నెండు గంటలను సూచిస్తోంది రిస్ట్‌వాచీ... దూరం నుంచీ ఓ గబ్బిలం తన వంకే తీక్షణంగా చూస్తోన్న ఫీలింగ్‌ కలిగింది సంఘమిత్రకు.పన్నెండు గంటల క్రితం జరిగిన సంఘటన అతనికి గుర్తుకు వస్తోంది.సరిగ్గా పన్నెండు గంటల క్రితం...అదిగో... కనుచూపు మేరలో కనిపించేదే ‘వాంపయిర్‌ హౌస్‌’ చెప్పాడు దివాకర్‌.చీకట్లో కొరివి దెయ్యంలా వుంది... నలుపు రంగులో వున్న ఆ భవనం ఎపడు కూలిపోతుందా? ... అన్నట్టుంది.సంఘమిత్ర ఓసారి ఆ భవనం వైపు చూసి అన్నాడు ‘‘మిస్టర్‌ కృష్ణమూర్తీ... నీకు ఆ భవనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?’’ కృష్ణమూర్తికి దైవభక్తి, దెయ్యాల పట్ల భయమూ రెండూ ఎక్కువే... 

‘‘నేను దాని గురించి కామెంటే చేయను... మనం మాట్లాడే మాటలు ఆ శిథిల భవనంలో వున్న వాంపయిర్స్‌ వింటే...?’’ భయంగా, లోగొంతుకతో అన్నాడు కృష్ణమూర్తి.నవ్వి అన్నాడు సంఘమిత్ర ‘‘వింటే ఏమవుతుంది?’కృష్ణమూర్తి యిల్లు వెతుక్కుంటూ వస్తాయా?’’‘‘సంఘమిత్ర.... దెయ్యాలను తేలిగ్గా తీసిపారేయకు.. దెయ్యాల మీద పరిశోధనలు చేయడం, అవి లేవు.. అని వాదించడం నీకు అలవాటూ, వృత్తీ అయితే అవ్వొచ్చు.. అలా అని మా నమ్మకాలను కాదనకు... అయినా ఓసారి అందులో గడిపివస్తే తెలుస్తుంది...’’ వెటకారంగా అన్నాడు దివాకర్‌.‘‘వ్వా...ట్‌.. నేనా.. అందులో గడిపి రావాలా.. ఓయస్‌...’’ భుజాలు ష్రగ్‌చేస్తూ అన్నాడు.ఒక్క క్షణం నిశ్శబ్దం... ‘‘ఏంటీ.. నువ్వెళ్తావా! మనం ఇక్కడి వరకూ వచ్చి సాహసం చేశాం... ఆ భవనంలో ఒక రాత్రంతా గడపడం అంటే.. వాంపయిర్స్‌తో సహవాసం చేయడమే... తెల్లారేసరికి శవమైపోతావ్‌...’’ కృష్ణమూర్తి భయంగా అన్నాడు.‘‘నాకలాంటి భయాలేం లేవు... మీకన్నా నాకే ఆ వాంపయిర్‌ హౌస్‌ గురించి తెలుసు... మూడు వందల సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బెలెన్‌ అనే దక్షిణాఫ్రికాలోని ఓ ఆటవిక తెగకు చెందిన క్షుద్రోపాసకుడు ఇక్కడికి వచ్చి, క్షుద్రోపాసనకు అనుకూలంగా వుండే భవనాన్ని క్షుద్రశక్తులకు అనుకూలంగా, వాస్తు విరుద్ధంగా తనే స్వయంగా పదేళ్ళపాటు శ్రమపడి నిర్మించుకున్నాడు. ఆ భవనంలోని నేల మాళిగలో క్షుద్రోపాసనతో వాంపయిర్‌గా... అంటే రక్తపిశాచిగా మారి జనాన్ని తన ప్రపంచంలోకి ఆహ్వానించేవాడు. నేల మాళిగలో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను సమాధి చేసి క్షుద్రపూజలు నిర్వహించేవాడు. ఈ విషయం బయటకు పొక్కి జనం తిరగబడ్డంతో ఇదే భవనంలో ‘ఉరి’ పోసుకుని మరణించాడు.