‘‘సొమటైజేషన్’’‘‘సొమటైజేషన్’’మీ ప్రాబ్లమ్‌ని ‘‘సొమటైజేషన్’’ అంటారు.నాకు ఆ మాట అంత సంచలనం కలిగించలేదు. ఆశ్చర్యం కలిగించలేదు. అలాగనిఅర్థం కాలేదు. నా నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోయేసరికి....ఆయనే చెప్పడం మొదలు పెట్టాడు...సిటీలో సుమారు ముప్ఫై ఏళ్ళుగా... మంచి హస్తవాసి ఉన్న డాక్టర్‌గా పేరున్నడా. శ్యాంసుందర్ వైద్యాన్ని కేవలం డబ్బు సంపాదన కోసమే కాక తనసంతృప్తి కోసం చేసే డాక్టర్లలో అతనొక్కడు. పేషెంట్‌ని ఫిజికల్‌గా చెక్ చేసిప్రిస్ర్కిప్షన్ యిచ్చేయకుండా అతనిని మానసికంగా స్టడీ చేసి వాళ్లకుదగ్గరయి తర్వాత ట్రీట్‌మెంట్ చెయ్యడం అతని అలవాటు.అందుకే అతని అపాయింట్‌మెంట్ కోసం రోజులు వెయిట్ చేసితీరాలి. ఒకసారి అతనిని కలిసిన తరువాత మళ్లీ అత నిని కలవాల్సినఅవసరం రాదు. ఈ నోటా... ఆ నోటా... అతని కీర్తి నగరం నలుచెరుగులాపెరిగి అతని ప్రాక్టీస్ సూర్యచంద్రులను చూసే తీరిక కూడా లేకుండా ఆ రూంకేఅంకితమయిపోయేలా చేసింది.మా ఇద్దరి మధ్య డాక్టర్ - పేషెంట్ సంబంధమే కాకుండా ఇతరత్రా విషయాలు మాట్లాడుకునే సాన్నిహిత్యం ఉంది.ఈ రోజుల్లో ఏదైనా విషయం ఎవరితోనైనా పంచుకునే కోరిక, తీరిక, ఓపిక లేకుండా పోతోంది. మనకిష్టమైన విషయం అవతలి వారికి నచ్చకపోవడం...అలాగే జీవితంలో ప్రాధాన్యతాంశాలు మారిపోవడం...మనుషులతో మానేసి మనం యంత్రాలతో సహవాసం చెయ్యడం...ఇలా చాలా కారణాలే ఉన్నాయి.,అందుకే నవ్వడం, ఏడ్వడం అనే సహజ ప్రక్రియలకు కూడా మనం దూరమయిపోతున్నాం.డా. శ్యాంసుందర్‌కి నా మీద పూర్తి అవగాహన ఉంది.
నా తెలివితేటల స్థాయిని... ఆలోచనల స్థాయిని... చాలా ఈజీగానే అంచనా వేయగలడు. కానీ నేనొక పట్టాన కన్విన్స్ కానని... నాకెలా చెప్పాలో తెలియక తటపటాయిస్తూ చెబుతున్నట్టు అనిపిస్తోంది.ఒక్కోసారి ఎంతటి వక్తకయినా... మాటలు కరువవుతూ ఉంటాయి.దానికి కారణం అవతలి వ్యక్తి ఏమనుకుంటాడో... మనం సూటిగా మాట్లాడితే అన్న భావనే. అలాంటప్పుడు మౌనం వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ సాధనం అవుతుంది.మా మధ్య నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ... డాక్టర్ గారికి ఫోన్ వచ్చింది.‘‘బయట పేషెంట్‌లు చాలామంది వెయిట్ చేస్తున్నారు... తొందరగా ముగించమని’’ రిసెప్షనిస్ట్ సూచనలా తోచింది వాళ్ళ మాటలు బట్టి.ఇంపార్టెంట్ కేసని ఓ పావుగంట డిస్టర్బ్ చెయ్యొద్దని సీరియస్‌గా చెప్పి ఫోన్ పెట్టేసారు డాక్టర్.,డాక్టర్ నాకేసి చూస్తూ... ‘‘ఇంకాస్త డిటైల్డ్‌గా మీ ప్రోబ్లెం చెబితే... మనం ఒక కన్‌క్లూజన్ కొద్దాం... నథింగ్ టు వర్రీ’’ అన్నారు.నాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది.చాలురా బాబు. వీడి దగ్గరకు రావడం నాది బుద్ధి తక్కువ. వీడు నా మీదే రీసెర్చిని మొదలెట్టేసాడు.మళ్లీ కలుద్దాం... థ్యాంక్స్ చెప్పేసి బయటకు వెళ్ళిపోదామని నిర్ణయించుకొన్నాను.