ప్రభాకరం తన తల్లితండ్రులతో కల్సి పెళ్లి చూపులకు శంకరం గారింటికి వెళ్లాడు. పెళ్లి కూతురు సుధారాణి. అందాలబొమ్మ. ఆమెను చూడగానే సుధారాణి అనే కంటే అందాలరాణి అంటే ఆమెకు తగినట్లుగా వుంటుందని అనుకున్నాడు. ప్రభాకరంలో ఈస్థటిక్‌ సెన్స్‌ అంటే అందానికి స్పందించే లక్షణం ఎక్కువ పాలులో వుంది. పచ్చని బంగారు ఛాయతో మెరిసిపోతున్న ఆమె, తన పొడవైన జడను ముద్దాడటానికి పెద్ద బంతుల వంటి ఆమె పిరుదులు పోటీ పడుతూ వుండగా, హంస నడకతో ఒయ్యారాన్ని ఒలకపోస్తూ అందరికీ కాఫీ కప్పులను ట్రేలో తీసుకు వచ్చింది. ప్రభాకరానికి కప్పు అందిస్తూ వుండగా ఆమె పైటజారి పై ఎదను బయట పెట్టింది. ఆమె ఎద సంపద అతని దృష్టిని ఆకట్టుకుంది. అక్కడ వున్న పెద్దలంతా కాఫీలు తాగుతూ కబుర్ల ధ్యాసలో వున్నారు. ప్రభాకరం వెంటనే కాఫీ కప్పు అందుకోకుండా తన ఎదను చూస్తుండటాన్ని గమనించి ఆమె సిగ్గుపడి నెమ్మదిగా ‘కాఫీ తీసుకోండి’ అని అతని దృష్టిని మరల్చి పైటను సరిచేసుకుంది. ఆమె తియ్యని కంఠం నుంచి వచ్చిన ఆ రెండు మాటలు అతనిని ఈ లోకంలోకి తీసుకువచ్చాయి. వెంటనే అతను కాఫీ కప్పు అందుకున్నాడు. కాని అతని మనసంతా ఆమె అందాల చుట్టూ భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తున్నట్లుగా తిరుగుతోంది. అతను తన తండ్రి గోపాలం చెవిలో అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడాలని వుందని చెప్పాడు. 

గోపాలం శంకరానికి ఈ విషయం చెప్పిన వెంటనే ఆయన ఓ.కే. అన్నాడు. ప్రభాకరం, సుధారాణి డాబా పైకి వెళ్లారు.‘‘నేను మీకు నచ్చానా?’’ అడిగాడు ప్రభాకరం.ఆమె అవునన్నట్లుగా తల వూపింది.‘‘మరి... నేను మీకు నచ్చానా?’’ అని అతని కళ్లల్లోకి చూస్తూ ఆమె అడిగింది.‘‘అన్ని అందాలను స్వంతం చేసుకున్న మీరు నచ్చలేదు అనేవాడికి అందమంటే అర్థం ఆవ గింజలో అరవై వంతు కూడా తెలియదని ఖచ్చితంగా అంటాను. మీరు నాకు నూటికి నూరు పాళ్లు నచ్చారు. మీ అందాలు మొట్టమెదట మిమ్మల్ని చూసినప్పుడే నన్ను పరవశుడిగా చేశాయి. అందుకనే మీ చేతినుండి కాఫీ కప్పును వెంటనే అందుకోలేక పోయాను’’ జరిగిన చిలిపి సంఘటన గుర్తుకువచ్చి ఆమె ముఖం సిగ్గుతో పసుపురంగు నుంచి ఎరుపులోకి మారింది. కొంచెంసేపూ ఆమె అతని కళ్లలోకి సూటిగా చూడలేకపోయింది. తరువాత తన సిగ్గు తెరను తొలగించి ఆమె ‘‘నా అందం మీకు అంతగా నచ్చిందా?’’ అని అడిగింది.‘‘ఎంతగా నచ్చిందో నేను మాటల్లో చెప్పలేను. సమయం వచ్చినప్పుడు మీ అందాలన్నీ దోచు కున్నప్పుడు మీ అందం నాకెంతగా నచ్చిందో మీకు తెలుస్తుంది’’.