‘‘అతడామె నుదురును చుంబించాడు. ఆమె పరవశంతో వివశత్వానికి లోనైంది. అతడామె కంఠాన్ని ముద్దాడాడు. ఆమె కనురెప్పలు మూతపడ్డాయి. ఆతడామె హృదయభాగాన్ని పెదవులతో స్పృశించాడు. ఆమె మనసు పొరల్లో వేనవేల తుపానులు చెలరేగాయి. రోమాంచిత తీరాల్ని దాటాయి. ఆమె నాభి అతనికి అయస్కాంత క్షేత్రమైంది. భూమధ్యరేఖను దాటిన అతనికి ఒక్కసారిగా విరహాల ఉప్పెన చుట్టుముట్టింది. అతడ్ని అల్లుకుపోవలసిన ఆమె విడివడి, భయపడి, సిగ్గుపడి అటు తిరిగి పడుకుండిపోయింది’’టోకోఫోబియా.... ఐ హేట్‌యూ... అతను మనసులో అనుకున్నాడు.పెళ్లైన ఆరునెలలుగా అతనికీ విచిత్రానుభవం విషాదమే.అతడి పేరు కాశ్యప్‌... అనురాగ్‌ కాశ్యప్‌.ఆమె పేరు మృదువని... ఇంట్లో హనీ అని పిలుస్తారు.వాళ్లిద్దరికీ పెళ్లై ఆరునెలలు అయింది. అతనికి ఆమెలో మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌ల కొలతలకన్నా తన మిసెస్‌కు ఉండవలసిన, తను కోరుకున్న అర్హతలు చాలా కనిపించాయి.

సింపుల్‌గా ఉండే ఆమె చీరకట్టు, నవ్వినపడు సొట్టలు పడే ఆ బుగ్గలు, నడుమ్మీద అతనికిష్టమైన అందమైన మడత, చూపులతో ‘మొగుడికి మాత్రమే’ ప్రోవకేటింగ్‌గా కనిపించే ఆమె నడత.... ఇవన్నీ అతనికి ఇష్టమైన విషయాలు.పెళ్లిచూపుల్లో ఆమె పొడవాటి చేతివ్రేళ్ళు కాఫీ కప ఇస్తున్నపడు తగలగానే అతనికి కాఫీ రుచి మారిపోయినట్టు అనిపించింది. కాఫీ రుచిలో పెద వుల స్పర్శ తగిలేది.అతను ఆమెను ఒకే ప్రశ్న అడిగాడు ‘‘నేను నచ్చానా?’’ఆమె పెదవులు వణికేయి. తలకిందికి వాల్చింది. నునుసిగ్గు ఔననే ఆన్సర్‌ని చెప్పింది.పెళ్ళయ్యింది. మొదటిరాత్రికి అత్తవారిల్లే వేదిక అయింది.పాలగ్లాసుతో మృదువని లోపలికి అడుగుపెట్టింది. అతని చేతికి పాల గ్లాసు ఇచ్చి, పాదాలకు నమస్కారం చేయడానికి కిందకు వంగింది. అతను పాలగ్లాసు టీపాయ్‌మీద పెట్టి ఆమె భుజం మీద చేయి వేసి పైకి లేపి అన్నాడు.‘‘నువ్వుండాల్సింది ఇక్కడ..... ఈ గుండెల్లో’’ అంటూ ఆమె తలను తన గుండె దగ్గరికి చేర్చుకున్నాడు. ఆమె ఒక్క క్షణం అలానే కళ్లు మూసుకుంది. అతని గుండె చపడు స్పష్టంగా ఆమెకు వినిపిస్తోంది. అనురాగ్‌ కాశ్యప్‌ ఆమె వీపు చుట్టూ చేయి వేశాడు. ఆ చేయి ఆమె జాకెట్‌ కింది భాగం నుంచి నడుం భాగానికి వచ్చింది.