‘సర్‌, మీతో అర్జెంట్‌గా మాట్లాడాలి ఎపడు రమ్మంటారు?’’అని టెలిఫోన్‌లో ఎవరో అడిగారు.ఆ గొంతు గుర్తుకు రాలేదు శంకరానికి, ‘‘క్షమించండి,ఎవరు మాట్లాడుతున్నది?’ ’ అన్నాడు.‘‘నేనండి. మీ టైలర్‌ జయరావును’’ అని సమాధానం వ చ్చింది.‘‘ఈ సాయంత్రం అయిదు గంటలకు వస్తే బాగుంటుంది’’అని జవాబు చెప్పాడు. సరిగ్గా గడియారం అయిదు కొట్టేటప్పటికి ప్రత్యక్షం అయ్యాడు జయరావు, ‘‘నమస్కారమండీ’’ అంటూ.‘‘ఏమిటి సంగతి !?’’‘‘పెద్దవిషయం ఏమీ కాదండీ. మీకు శ్రమ యిస్తున్నాను’’‘‘చెప-’’గొంతు యింకాస్త సరళం చేసుకుంటూ జయరావు, ‘‘నేను నవల రాసేనండీ. చిన్నదే. నూట యిరవయి పేజీల కంటే ఎక్కువ కాదు అచ్చులో. కాని- చదివిం తర్వాత, నాకే తృప్తిగా అనిపించలేదు. 

మీరు కాస్త దాన్ని చదివి, సవరణలు చెప్పాలి. మీ మీద నమ్మకంతో తీసుకు వచ్చాను’’ అంటూ చేతి సంచిలోంచి ఓ కాగితాల బొత్తి బయటపెట్టాడు.శంకరానికి ఆశ్చర్యం అనిపించింది. జయరావు నవల వ్రాయడం ఏమిటి? హాయిగా బట్టలు కుట్టేపని చేసుకుంటూ కూర్చోక ! అంతేకాదు, మీరు వ్రాసింది వారికి ఎంతో ప్రీతిపాత్రంగా వుండే రోజుల్లో తన రచన తనకు అసంతృప్తిగా వుంది అని నిర్మొహమాటంగా చెప్పడం- మరింత విడ్డూరం !అతని నిజాయితీకి కాస్త నివ్వెరపోయిన మాట నిజమే. ఏమైనా చొక్కాలు, పాంట్లు రిపేర్‌ చేయించు కోవలసి వస్తే జయరావు దగ్గరకు తీసుకువెళ్లటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు శంకరం. కొత్త బట్టలు కుట్టటంలో ఎపడూ బిజీగావుండే శంకరం రిపేర్‌ పని చేయమంటే ముఖం చిరాగ్గా పెడతాడు. అతని పనితనంలో విశ్వాసంవల్ల యెంత ఆలస్యం అయినా ఓపిగ్గా ఆగుతాడు శంకరం. జయరావుకు పనిలో నైపుణ్యం వున్నమాట నిజయే అయినా అతనికి టైం సెన్స్‌ అనేది బొత్తిగా లేదని కూడా తెలుసు. ఎపడూ బట్టలు ఇస్తానన్న టైముకు యిచ్చి పుణ్యం కట్టుకోలేదు. రెండు వాయిదాలన్నా వేయ కుండా పని పూర్తిచేయడం జయరావుకు సుతరామూ వీలుకాదు. అలాంటి మనిషి యిపడు నవల రాయడమే కాకుండా, దాని రిపేర్‌ వర్క్‌ తనకు యివ్వచూపుతున్నాడు.‘‘అలాగే చూసి పెడతాను’’ అంటూ కాగితాలు అందుకున్నాడు. జయరావు ముఖం ఆనందంగా వెలిగిపోయింది. ‘‘మళ్లీ ఎపడు రమ్మంటారు నన్ను’’ అన్నాడు నిదానంగా.‘‘ఓ వారం రోజులు టైం యివ్వు’’‘‘అయితే పై బుధవారం యిదే టైంకు వస్తానండీ- మీ మేలు ఎన్నటి కీ మరిచిపోను’’ అని నమస్కారం చేసి వెళ్లిపోయాడు.అన్నట్లుగానే బుధవారం మళ్లీ ప్రత్యక్షం అయ్యాడు.అతనికి ‘టైం సెన్స్‌’లో ట్రెయినింగ్‌ యిస్తున్నందుకు సంతోషించాడు శంకరం. ‘‘అంతా చదివాను. నీవన్నట్లు నాకూ అసంతృప్తిగానే వుంది’‘ అంటూ ప్రారంభం చేశాడు.