లోకనాథం అపడే ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చాడు.భార్య రోహిణి, కొడుకు వినీత్‌లు తన కోసమే ఎదురు చూస్తున్నట్లుండడం కాస్త కలవరపాటుకు గురిచేసింది. అయినా అంతా మామూలుగానే ఉన్నట్లు లుంగీలోకిమారి పేపర్‌ చేత పట్టుక్కూర్చున్నాడు. రోహిణి,వినీత్‌లు కూడా చెరో కుర్చీ లాక్కొని లోకనాథానికిఎదురుగా కూర్చున్నారు.‘‘నాన్నా.... నేను చెప్పింది ఏం చేశారు?’’ మెల్లగాఅడిగాడు వినీత్‌.‘‘చూద్దాం... అయినా అన్నీ ఇప్పటికిపడు కావాలంటే ఎలా?’’లోకనాథం ప్రతిస్పందన వినీత్‌తోపాటు, రోహిణికి కూడా అసంతృప్తిగా వుంది.‘‘అందరి ముందు నాకెంత నామోషీగా వుందో తెలుసా?’’‘‘నామోషీ దేనికి? నూటికి తొంభై మంది ఎలా వున్నారో, ఎలా వెళుతున్నారో అలాగే వెళదాం.’’‘‘నాకలా కుదరదు. నేను ఇంతవరకూ మిమ్మల్ని నాకిది కావాలని అడగలేదు. సెలవులైపోయి కాలేజీలో చేరేలోపు నేనడిగింది మీరివ్వాలి.’’‘‘నీ కోరిక నువ్వు చెప్పావు. బాగానే వుంది. మరి డబ్బు సంగతి?’’ లోకనాథం నోట్లోంచి డబ్బు గురించి వినపడగానే రోహిణి జోక్యం చేసుకుంది.‘‘దేనికైనా డబ్బు లేదనడమే! అయినా వాడు అడక్కడక్కడ ఒకటి అడిగితే అదీ...చేతగాదనడం...మీ సంబడం ఇరవైయేళ్ల నుంచీ నేను చూస్తున్నదేగా?’’ రోహిణి మాటల్లోని దెప్పిపొడుపు లోకనాథానికి కొత్తేం కాదు. పెళ్లనయిప్పటినుంచీ వున్నదే!తల్లి మద్దతుతో వినీత్‌ గళం మరింత పదునెక్కింది. 

తండ్రి కావాలనే తాత్సారం చేస్తున్నాడని, తను గట్టిగా మాట్లాడకుంటే మెత్తబడేలా లేడని నిర్ణయించుకున్నాడు. ‘‘నాన్నా.... నేను కాలేజీకి వెళ్లేలోపు ఇప్పించండి. దానికి వన్‌ మంత్‌ టైముంది. ఎప్పటిలా నా వల్ల కాదంటారా... చదువులు చదవడం నా వల్ల కూడా కాదని ఈ అపార్ట్‌మెంటు నుంచి కిందికి దూకేస్తా. మీ ఇష్టం ఇక...’’ చరచరా నడుచుకుంటూ బయటకెళ్లాడు.లోకనాథం ఒళ్లు ఝల్లుమంది. ఎంత మాటన్నాడు! దూకి చావడమా? ఏమంత కష్టం వచ్చింది? వినీత్‌కు తను ఏరోజు తక్కువ చేశాడు? ఎందుకిలా మారాడో అర్థం కాలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపి కర్చీఫ్‌తో కళ్లు ఒత్తుకున్నాడు. రోహిణికైతే బ్రతకడం చేతకాని వాడిలా జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించలేని దద్దమ్మలా లోకనాథం అగుపించాడు. తనూ అక్కణ్ణించి విసురుగా వెళ్లిపోయింది.్‌్‌్‌ఆఫీసుకు వెళ్లేందుకు బస్‌లో కూర్చున్న లోకనాఽథానికి ఇంటి మీదే ధ్యాసంతా! హైదరాబాద్‌ రావడానికి ముందర గతమంతా జ్ఞప్తికి వచ్చింది. పల్లెటూరికి, పట్టణానికి మధ్యస్థంగా వుండే ఊరిలో వుండేవాడు తను. లోకనాథం శ్రద్ధతో పాటు, సహజ ప్రతిభ కూడా తోడై చదువులో వినీత్‌ ఒక అడుగు ముందే వుండేవాడు. ఏడవ తరగతిలోనే వినీత్‌ సామర్థ్యం అందరికీ తెలిసింది. ఇక పదవ తరగతిలో డివిజన్‌లోనే అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు.బంధువులు, స్నేహితులు లోకనాథాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఇంటర్‌ మాత్రం మంచి కార్పొరేట్‌ కాలేజీలోనే చేర్చమని ఉచిత సలహాల కుప్పలు పోశారు. లోకనాథం కూడా ‘మంచి’ కాలేజీలో చేర్చాలనే నిర్ణయించుకున్నాడు. చదువు విషయంలో ఢోకా లేకున్నా వినీత్‌ మొండితనమే లోకనాథానికి భయం కలిగించేది.