రాజకీయ నాయకుడి ఇల్లుకర్టెన్ తెరవగానే ఓ గుడ్డతో చేసిన మనిషి బొమ్మ ఒక్క వుదుటున వచ్చి పడుతుంది. దాని మీదకి పరుగుతో వచ్చి కసిగా కూచుంటాడు. కొణుజు. బాక్సింగ్ పంచ్‌లు ఇస్తాడు. ఒకటి నుండి పది దాకా నెంబర్లు లెక్కపెట్టినట్లు మైమ్ చేసి విజయగర్వంతో కేక పెడతాడు. వెనక నుంచి రాజకీయ నాయకుడు వచ్చి కొణుజు నెత్తిమీద ఒకటి వేస్తాడు. కొణుజు గిరగిరా తిరిగి సోఫాలో పడతాడు.కొణుజు : అయ్యా! తమరా! ఈ బొమ్మకు ప్రాణం వచ్చిందేమో అనుకున్నా!రా.నా. : వస్తుందిరా ! దానికి రావడం, నీకు పోవడం ఒకేసారి జరుగుతాయిరా!కొణుజు : అలా సెలవీయకండయ్యా ! నన్నెప్పటికైనా ఒలెంపిక్స్‌కి పంపిస్తానని వాగ్దానం చేశారు ! మైకు టైసన్ని మించిపోయేట్లు చేస్తానన్నారు.రా.నా. : అరేయ్ ! ఆ మైక్‌టైసనిపడు కండలు మెత్తబడి మూల పడ్డాడురా. అయినా సరే వాడు నీ నెత్తి మీదొకటిస్తే కాళ్లు తుడుచుకుండే పట్టా కింద కూడా పనికిరావు రోయ్.కొణుజు : మీరెన్నన్నా అనండి- మీ మాటే నాకు ఏదం. అంతే !(వెనక్కు వెళ్లి టైసన్ ఫోటోకి దండం పెడతాడు)రా.నా. : అందుకేరా నీవు అచ్చమైన ఓటరువి.
నీలాంటి వాళ్లు కోట్లలో వుండబట్టే నాలాంటి రాజకీయనాయకులు ఇచ్చల ఇడిగా వర్ధిల్లుతున్నారు.కొణుజు : బాగుపడే లక్షణం కాదు (చిన్నగా)రా.నా. : ఏంట్రా నాకే ఏదో సెప్పొస్తున్నావు.కొణుజు : అదేం లేదయ్యగోరు. ఆ కొండంత మనిసితో బాక్సింగ్ చేయాలన్న కొండంత కోరిక తగునా అనుకుంటూ బాగుపడే లక్షణం కాదు అని నన్ను నేనే అనుకుంటున్నాను.రా.నా. : సాద్దాసాద్యాలు ఆలోసించకుండా దేన్నైనా ఆశించడం ఈ యుగదర్మంరా ! తప్పకుండా పెద్ద బాక్సేర్‌వవుతావు.కొణజు : కాదు తమరు చేస్తారు. (రా.నా. చేయి తన నెత్తి మీద పెట్టుకుంటాడు)యస్సై : (వచ్చి) చేస్తారు. నన్ను డీయస్పీ చేస్తానన్నారు. చివరికి ఎస్సై పోస్టే లేకాపోకా వేలాడేట్టు చేశారు.రా.నా. : సగం జీతం వస్తనే వుంది కదయ్యా ! అక్కడికేదో బొచ్చెకొట్టుకుంటూ అడుక్కుతింటున్నట్లు మాట్లాడుతున్నావు.యస్సై : మిమ్మల్ని నమ్ముకుంటే ఆ బొచ్చె కూడా దొరికేట్లు లేదు.కొణుజు : అయ్యగారి మీద యిసోసం తగ్గించుకోమాకు పోలీసాయనోయ్‌రా.నా. : నా కెదురు తిరగిన ఆ టీచరమ్మను పోలీసు స్టేషన్‌కి రప్పించి పరువు పోయేట్టు సేమయన్నాను గానీ మహిళా సంఘంవోళ్లు నా ఇంటి ముందు టెంటేసి నిన్ను ససుపెండ్ సేసిందాకా వొదలకుండా అయ్యేట్టు సేయమన్నానా!కొణుజు : ఏదో కాకి బుద్ధి కాకికి ముద్దు.