చికాగో మహానగరంలో విమానం దిగి నేల మీద అడుగు పెడుతోంటే ఒడలు పులకరించింది.ఇది నూట పదేళ్ళ క్రిందట వివేకానందుడు అడుగుపెట్టిన పుణ్యగడ్డ - అన్నభావన నన్ను నిలువునా కుదిపేసింది.ఎక్కడి కన్యాకుమారి మరెక్కడి చికాగో!హిందు మత ప్రతినిధిగా భారతీయ వేదాంతం గురించి యావత్ప్రపంచానికి తెలియజెప్పాలన్న మహత్తర లక్ష్యంతో జేబులో రూపాయిలేకుండా ఇక్కడి కొచ్చిన ధీశాలి ఆయన!‘‘హమ్మో! ఎయిర్‌పోర్ట్ ఎంత పెద్దదో చూడండి...’’నా భార్య రమ అంది.‘‘అదేం గొప్పకాదు గాని స్వామీ వివేకానందసర్వమత సమ్మేళనంలో పాల్గోటానికిఇక్కడికే వచ్చారు. పాశ్చాత్య దేశస్థుల్నిసోదరీ సోదరమణులారా అనిసంబోధించి సమ్మోహన పరిచిందిఇక్కడే...’’‘‘అలాగా!’’ చుట్టూ మరింత విస్మయంగా చూస్తూ అంది.ఆ నేల ఆ గాలి ఏదో పరమార్థం చెబుతున్నట్టు అనుభూతికి లోనైంది.‘‘కన్యాకుమారిలోని విగ్రహమూ, సముద్రంలోని ఆ కొండ, దాని మీద ధ్యాన మందిరం గుర్తొస్తున్నాయండీ...’’‘‘రియల్లీ గ్రేట్ మేన్. ఆయన సమర్థత సంకల్పబలం సత్యనిష్ఠ అనితర సాధ్యం!’’వీసా చెక్కింగులూ లగేజ్ స్కానింగులూ అయ్యాయి.సూట్‌కేసుల్లోని పచ్చళ్ళూ తినుబండారాలు చెక్కింగు అధికారుల దృష్టిలో పడనందుకు రమ పొంగిపోయింది.కనెక్టింగ్ ఫ్లైట్‌కి లగేజీ హేండోవర్ చేసి చెరో హేండ్ లగేజ్ ఈడ్చుకుంటూ మా గేట్ దగ్గరికెళ్తోంటే ఒక విదేశీయుడు పలకరించాడు.
‘‘మే ఐ హెల్ప్ యూ’’ అంటూనే చొరవగా రమ బ్యాగ్ అందుకున్నాడు.రమ చీరవంక అభినందన పూర్వకంగా చూస్తూ ‘‘యూ ఆర్ లుకింగ్ గ్రేట్. యువర్ ఇండియా ఈజ్ గ్రేట్. యువర్ తాజ్‌మహల్ ఈజ్ గ్రేట్’’ అన్నాడు.నా భుజాలు ఉప్పొంగాయి. ‘‘యస్. అవర్ కల్చర్ ఈజ్ గ్రేట్. అవర్స్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద వరల్డ్. డూ యూ నో అవర్ వేదాస్ గీత..’’‘‘ఐ నో కిషన్...’’‘‘యస్. కృష్ణ... హీ ఓన్లీ ప్రీచ్‌డ్ గీత. గాడ్స్ వరడ్స్ ఆర్ రెలవెంట్ ఈవెన్ టు డే టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్...’’అతగాడి కెంతఅర్థమైందో తెలీదుగాని పది నిమిషాలపాటు ఏకధాటిగా దంచేశాను.అతడు మా పరిచయం కలిగినందుకు సంతోషంగా వుందన్చెప్పి బ్యాగ్ రమ కిచ్చి మరో ప్రక్క కెళ్ళిపోయాడు.‘‘అక్కడి పిల్లల బుర్రలు తినడం చాలదా ఇక్కడా ఉపన్యాసాలిస్తున్నారూ!’’‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి అన్నారే. జన్మభూమిని తలచుకుంటే చాలు నా గుండెలు ఉప్పొంగిపోతాయి. అలాటి పుట్టినగడ్డకి దూరం కాకూడదురా అని నెత్తీనోరూ కొట్టుకున్నాను. నీ కొడుకు తలకెక్కితే కదా!’’‘‘రేపట్నుంచి అబ్బాయి మెదడు తింటారు కాబోలు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. వాడు బాధ పడేట్టు ఒక్క మాటన్నా నేను వూరుకోను...’’‘‘వూరికే నేను మాత్రం ఎందుకంటానే పిచ్చిదానా!’’‘‘మీ మాట కాదని అమెరికా వచ్చాడని మీకు కోపం. గ్రీన్ కార్డ్‌కి అప్లై చేశాడని తెలిసినప్పట్నుంచి ‘ఆఁ’లూ ‘వూఁ’లూ తప్ప మాటలే లేవుకదా!’’