సింహాద్రి అరుపునకుదూరంగా వాల్‌పోస్టర్‌తింటున్న గాడిదప్రతిస్పందించి ఓండ్రపెట్టి చెవులు రిక్కించి చుట్టూరాకలియజూసింది. ‘ఎవడ్రానా బంధువు!’ అన్నట్లు.సింహాద్రి ముఖ్యోద్దేశం గాడిదకి బంధువు అవుదామని కాదు. ఈమధ్య కాస్త ఆసనాలునేర్చుకుని తెల్లారగట్ల లేచిడాబా ఎక్కి సింహాసనంవేద్దామని ప్రయత్నించాడు. సింహంలా కూర్చుని నాలికచాపి గట్టిగా సింహగర్జనచేయాలనే అతని ప్రయత్నం మరో జంతువునుఉసిగొలిపినట్టైంది. గాడిద ఓండ్ర పెట్టడంతో చుట్టూఉన్న కాలనీ వారంతాగాబరాపడి లేచారు. వాకిలి చిమ్ముతున్న ముత్యాలకివెంటనే అర్థమైపోయిందిఇదేదో పతిదేవునిప్రతీకారచర్యేనని.‘‘ఏమండీ! ఇట్లాంటి ఆసనాలు వేసి ఇల్లు వాడ బోరెత్తించకండి. అసలే పరీక్షల సీజన్‌. పిల్లకాయలు విసుక్కుంటున్నారు. గోడకి కాలెత్తే కుక్కలు కాలు దించేస్తున్నాయి. ఎగిరే పక్షులు ఎగరడం లేదు. మేసే గాడిలు మేయడం లేదు. మీకు చే తులెత్తి దండం పెడతాను కాస్త నామాట వినండి’’ ప్రాధేయపడుతూ చెప్పింది భార్య ముత్యాలు.‘‘ముత్యాలూ ఎవరేది మానినా నువ్వు మాత్రం టీవీ సీరియల్‌ చూడడం ఆపలేదు కదా! దానివల్లే నీకు నడుం నెప్పి. పెళ్ళైన కొత్తలో నీ నడుం సింహం నడుంలా ఉండేది. ఇపడేమో సిమెంట్‌ బస్తాలా తయారైంది. నువ్వు కూడా ఆ ప్యాంటు షర్టు వేసుకొచ్చి నాతో పాటు ప్రాక్టీసు చేయ్యి. నీ నడుంనొప్పి తగ్గిపోతుంది. యోగాసనాల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా!

’’ లెక్చర్‌ ఇవ్వడానికి తయారైపోయాడు సింహాద్రి.‘‘నేను ఆరోగ్యశ్రీ పథకంలో సభ్యురాలిని. నాకేం అక్కర్లేదు మీ యోగసనాలు. యోగమైనా భోగమైనా మీరే చూస్కోండి’’ దొరికితే బలైపోతానని వాకిట్లో ముగ్గేసి వస్తా అంటూ విసురుగా తప్పించుకుంది ముత్యాలు. ఆ దిక్కుమాలిన సింహాసనం వెయ్యకపోతేనేం అంటే అసలు నా పేరే సింహాద్రి సింహాసనం వెయ్యకపోతే ఎలాగే అంటూ తెగ బాధపడిపోతాడు సింహాద్రి. ఆ మాటకొస్తే యోగాసనాల్లో ప్రతి ఆసనం గొప్పదే అంటారు.మనిషి పుట్టింది కోతినుండే గదా ‘మర్కటాసనం’ నేర్చుకోకపోతే ఎలా? అని ఓ రోజు తికమకపడి కిందామీద పడి మడం మడతపడి బుద్ధొచ్చిందని వారం రోజులు ముత్యాలుతో వేడి నీళ్ళు కాపడం పెట్టించుకున్నాడు. కాస్త నయం అయ్యాక మళ్లీ వ్యవహారం మొదటికి వచ్చింది. జీవితంలో యాక్సిడెంట్స్‌ జరుగుతూనే ఉంటాయి. అంత మాత్రాన జీవన గమనం ఆగిపోదు అంటూ వేదాంతభేరి మ్రోగించేశాడు.‘ప్రజారోగ్యమే దేశసౌభాగ్యం’ అది దే శాభివృద్ధికే కాకుండా జాతీయభద్రతకు కూడా ముఖ్యమైందని అతని వాదన. ప్రతి పౌరుడు తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి అపడే దేశం సౌభాగ్యంతో విరాజిల్లుతుంది. ‘దేశమంటే వట్టి మనుషులు కాదోయ్‌, ఆరోగ్యకరమైన గట్టి మనుషులోయ్‌’ సింహాద్రి స్పీచ్‌ ఇవ్వడం మొదలెడితే మైకులు విరిగిపోయేవి.బ్యాంకు ఆఫీసర్‌గా ఉన్న సింహాద్రి గత సంవత్సరం విఆర్‌ఎస్‌ పెట్టి ఉత్తరదేశం తీర్థయాత్రలకి వెళ్లాడు. అక్కడ ఓ గురుస్వామి యోగాసనాలు చూసి మురిసిపోయి మరో పదిరోజులు అక్కడే ఉండిపోయి ప్రాక్టికల్స్‌ మొదలెట్టాడు. యాత్రలకు పోయిన పతిదేవుడు ఎక్కడైనా సిట్టింగ్‌లో ఇరుక్కుపోయాడా? లేక ఎవ్వరైనా సెట్టింగ్‌ చేశారా? ఆమె మనసులో ఉన్న ’కొర్రీస్‌’పై ఎంక్వయిరీ పూర్తికాకుండానే సగం పెరిగిన గెడ్డంతో తిరిగొచ్చాడు సింహాద్రి.