జీవంఒకానొకపడు...సూర్యుడి వేడికి సముద్రం నోరుతెరిచి చూసినపడు...ఉన్మత్త కెరటాలు మబ్బుకై చేతులు చాచినపడు...పర్వత, లోయల బాహువుల్లో చినుకు నర్తించినపుడు...అది నీటి గర్భాన గాలినీ నీటినీ నింపుకున్న సూర్యరశ్మి రసాయన సమ్మేళనం.అపడింకా జీవం నిస్తేజ పదార్థం.లయ.నైరూప్య దృశ్యం మీద ఆకాశం జల్లులుగా కురుస్తుండగా పచ్చికబైళ్ళపైన ఎగిరిపోతున్న సూర్యగోళం సగం విచ్చుకున్న పువ్వుతో మళ్ళీ వస్తానని చెప్పి కుంకుమ కురులలోకి దొర్లిపోయింది.సృష్టి లయావిన్యాసంలో మళ్ళీ జన్మిస్తున్నాము.... అన్నాయి వసంతాలు. ఋతువులు ఆకాశాన్ని చెట్లనుంచి చీల్చుకుని నవ్వుతున్నాయి. పక్షులు పచ్చని పచ్చి ఆకులను కొరుక్కు తింటున్నాయి తొందరలో. ఎండలకు అలసిన గాలులు లోయల మడుగుల్లో దాహం తీర్చుకుంటున్నాయి. గాలిలోకి లేచిన పుప్పొడిని పసిగట్టి మృగాలు లేచి తిరుగుతున్నాయి. చల్లటి గాలుల మృగశిర పిలుపుకి గడ్డిపరకలు ఒణుకుతూ నవ్వుతున్నాయి.అతడు...దృఢమైన దేహాన్ని వస్త్రంగా కపకున్న యువకుడు. బిగిసిన అతడి పర్వత బాహువుల నుంచి యవ్వనం కదం తొక్కుతూ ఉంది.

అతడు పర్వత సానువుల నుంచి ప్రవహించి లోయల లోతుల్లో వర్షించే దాత. మృదువైన అరణ్యాల నుంచి చొచ్చుకువెళ్ళే ఈదురుగాలి.ఆమె...సౌకుమార్యమే సౌందర్యంగా గల యువతి. గర్జించే మేఘాల మధ్యనుంచి ఉరుముల మెరుపుల పదఘట్టనలను పీల్చుకునే లోయ. అతడిని విశ్రాంతి మందిరంలో బంధించే రగులుతున్న పూలతీగ. అల్లుకునే జ్వాల.అతడు... ఆమె...చైతన్యం పదార్థాన్ని నిర్దేశిస్తూ పదార్ధం చైతన్యాన్ని నిర్దేశిస్తూ ఒకదానినొకటి పెనవేసుకుంటున్న సంగమంలో వారు పరస్పర సమ్మేళిత ప్రేరేపితులు. ఆకారాలు, గుణాలు, వైరుధ్యాలు వారి అలంకారాలు.. స్త్రీ పురుష వైవిధ్యాలు విశ్వజనీనాలు. ఉవ్వెత్తున ఎగసిపడే రెండు శరీర కెరటాలు.విరబోసుకున్న చెట్ల ఆకుల మధ్య తెల్లటి పూలు నక్షత్రాల్లా మెరుస్తుండగా అతడు ఆమె చేరువలో కూర్చున్నాడు. ఆమె కురులు విరబోసుకుని అలవోకగా తెల్లని పూలకొమ్మను చేతితో పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తుంది.‘‘ఈ పూలెక్కడినుంచి వచ్చాయి? వీటికి సౌందర్యాన్ని ఎవరు గుచ్చారు? వీటిలో సుగంధాన్ని ఎవరు తురిమారు?’’వెదురులోకి దూరిన గాలి వింత ధ్వని చేస్తూ ఉంది.అతడు ఆమె చేతిని మృదువుగా తన చేతిలోకి తీసుకున్నాడు. కళ్ళలోకి చూడలేక సిగ్గిలుతున్న ఆమె దేహంలోకి తాదాత్మ్యంగా చూస్తూ బిడియపడుతున్న చేతులని చనువుగా విడతీశాడు.