రాజాం రచయితల వేదిక సమావేశం

రాజాం రచయితల వేదిక 75వ సమావేశం ఏప్రిల్‌ 28 ఉ.9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్‌ పాఠశాలలో ఒమ్మి రమణమూర్తి అధ్యక్షతన జరుగుతుంది. ‘కనుమరుగౌతున్న కళింగాంధ్ర సాహిత్యం’ అనే వరుస ఉపన్యాసాలలో భాగంగా నాల్గవ ప్రసంగాన్ని ఆల్తి మోహనరావు ‘బహుజన కళ- భజన వాఙ్మయం’ అనే అంశంపై చేస్తారు.

గార రంగనాథం