హైదరాబాద్, నల్లకుంట: రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 28న సినీ సంగీత విద్వాంసుడు స్వర్గీయ డాక్టర్‌ సాలూరి రాజేశ్వరరావు 95వ జయంతి మహోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా డాక్టర్‌ బీవీ సాయికృష్ణ యాచేంద్రకు సాలూరి ప్రతిభా పురస్కార ప్రదానం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో నిర్వహిస్తు న్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.కె.రాము వెల్లడించారు. మంగళవారం హైదర్‌గూడలో విలేకరులతో మాట్లాడుతూ సాలూరి రాజేశ్వరరావు జయంతి మహో త్సవం సందర్భంగా ప్రతియేటా వివిధ రంగాల్లోని ప్రముఖులకు సాలూరి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా సాలూరి రాజేశ్వరరావు స్వరపరచిన చలనచిత్రాలలోని పాటలను గాయనీ గాయకులచే నిర్వహిస్తామని వివరించారు.