నక్షత్రకుడ’ంటే గోపాలం, గోపాలం అంటే ‘నక్షత్రకు’డన్నట్టుగా రంగస్థల పద్యనాటక లోకంలో రసజ్ఞ ప్రేక్షకులను అర్ధశతాబ్దం పైగా అలరిస్తూ నూతన శకాన్ని సృష్టించిన సిక్కోలు బిడ్డ యడ్ల గోపాలం. టీవీ, సినిమా రంగాల పోటీ తట్టుకొని, నేటికీ పద్యనాటక వైభవాన్ని తన నటనా వైదుష్యం ద్వారా, తన గాన కౌశలం ద్వారా ప్రేక్షక మహాశయులకు రుచి చూపిస్తూ ముందుకు పోవడం గోపాలం కృషి, పట్టుదలకు నిదర్శనం. ‘‘దంతావళమ్ముపయి బలవంతు డొక్కండు నిలిచి’’ అన్న పద్యాన్ని ఊపిరి బిగబట్టి అరగంటసేపు గోపాలరావు ఆలాపన చేస్తుంటే, ఆనంద పరవశులై మైమరిచిపోయిన జనంచప్పట్లతో ఈలలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఆయన నక్షత్రక పాత్రలో లీనమై అభినయిస్తుంటే అపర నక్షత్రకుడే భువికి దిగి వచ్చాడా అన్న చందంగా ఉంటుంది.

యడ్ల గోపాలరావుకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించటంతో యావదాంధ్ర పద్య నాటక సమాజం పరవశించింది. గతంలో ఎంతో మంది లబ్దప్రతిష్టులైన రంగస్థల పద్యనాటక కళాకారులకు పద్మ పురస్కారాలు లభించి ఉండవచ్చు. కానీ నేడు శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, మందరాడ గ్రామంలో ఒక సామాన్య, వెనుకబడిన రైతు కుటుంబంలో జన్మించిన యడ్ల గోపాలరావు గారిని ‘పద్మశ్రీ’ అవార్డు వరించడం అద్వితీయం.‘నక్షత్రకుడ’ంటే గోపాలం, గోపాలం అంటే ‘నక్షత్ర కు’డన్నట్టుగా రంగస్థల పద్యనాటక లోకంలో రసజ్ఞ ప్రేక్షకులను అర్ధశతాబ్దంపైగా అలరిస్తూ నూతన శకాన్ని సృష్టించిన సిక్కోలు బిడ్డ యడ్ల గోపాలం. టీవీ, సినిమా రంగాల పోటీ తట్టుకొని, నేటికీ పద్యనాటక వైభవాన్ని తన నటనా వైదుష్యం ద్వారా, గానకౌశలం ద్వారా ప్రేక్షక మహాశ యులకు రుచి చూపిస్తూ ముందుకు పోవడం గోపాలం పట్టుదలకు నిదర్శనం. ‘‘దంతావళమ్ము పయి బలవంతుడొక్కండు నిలిచి’’ అన్న పద్యాన్ని ఊపిరి బిగబట్టి అరగంటసేపు గోపాలరావు ఆలాపన చేస్తుంటే, ఆనందపరవశులై మైమరిచి పోయిన జనం చప్పట్లతో ఈలలతో ఆ ప్రాంత మంతా మార్మోగిపోతుంది. ఆయన నక్షత్రక పాత్రలో లీనమై అభినయిస్తుంటే అపర నక్షత్ర కుడే భువికి దిగి వచ్చాడా అన్న చందంగా ఉంటుంది.

తన పద్య రాగాలాపనతో జనాన్ని ఇట్టే పడేయగల దిట్ట గోపాలం. నాటకరాజమైన ‘హరిశ్చంద్ర’లో డి.వి.సుబ్బారావు, చీమకుర్తి నాగే శ్వరరావు, బండారు రామారావు, ఆచంట వెంకట రత్నం నాయుడు, మల్కా రెడ్డి, జూనియర్‌ డి.వి, విజయరాజు, గూడూరు సావిత్రి, జయనిర్మల, రేబాల రమణ, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలగు ప్రఖ్యాత కళాకారుల చెంత పోటాపోటీగా నక్షత్రక పాత్రలో నటించి ప్రజల మన్ననలు అందుకు న్నారు. నక్షత్రక పాత్రలో నటదిగ్గజాలైన పీసపాటి, షణ్ముఖిరాజు వంటివారు జన నీరాజనాలు అందు కున్నారు. గోపాలరావు ఆ పాత్రకు మరింత ప్రత్యేకతను సంతరించిపెట్టారు. ‘‘అలయక గుళ్లు గోపురములన్నియు, ఏలీలన్‌ సవరింతు మా ఋణము, వైదిక వృత్తి సంపాదింతు నంటివా’’ లాంటి పద్యాల ఆలాపనలో మిగతా నటులకంటే గోపాలం శైలి ప్రత్యేకం. నక్షత్రక పాత్రే గాక రామాంజనేయయుద్ధం, గయోపాఖ్యానం, శ్రీకృష్ణ తులాభారం, నారద గర్వభంగం, చింతామణి, కురుక్షేత్రం మొదలగు నాటకాల్లో ముఖ్యపాత్రలైన శ్రీరామ, శ్రీకృష్ణ, భవానీశంకర, నారద... మొదలైన పాత్రలలో కూడా గోపాలం అలరించారు.