పడక గది సంక్షోభంలో ఉంది

Crises! Crises... 
అక్కడ అన్ని పనులు జరుగుతాయి
ఆ ఒక్కటి తప్ప!
అన్ని పనులకు టైం దొరుకుతుంది
ఆ ఒక్కటి తప్ప!
 
ఎలా ఉండేదో నా పడక గది
సహజీవన దేహ పరిష్వంగం దృశ్యమై కదలాడేది
హృదయం పంచుకున్న క్షణాలను గుర్తుకు తెచ్చేది
మనసైన మాటలకు నెలవై ఉండేది
మోహం మా జీవితాల్నిఅల్లుకు నుండేది
 
ఇప్పుడు tension... tension 
సమయమంతా నగరానికి అంకితం
Restricted Emotions,
Disconnected Intimacy
 
పిల్లలొస్తారు
పుస్తకాలు మంచం మీద పడేస్తారు
పని అమ్మాయి వస్తుంది
ఉతికి ఆరేసిన బట్టలు తెచ్సి మంచం మీద వేస్తుంది
బంధువులొస్తారు
మంచం మీద కూర్చొని తింటారు
ఫ్రెండ్స్‌ వస్తారు
చాయ్‌ తాగుతూ మంచం మీద కూర్చుంటారు
 
పగలనక రాత్రనక నా మంచం బిజీ గానే ఉంటుంది
మా అర్బన్‌ జీవితాల్లా
నా మంచం మీద జరగని పని అంటూ లేదు
ఆ ఒక్కటి తప్ప
 
*****
మహెజబీన్‌