భయం గియం లేని కవిత్వం!
ప్రపంచవ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి, స్థానిక ఉత్పత్తి శక్తుల మీద, ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు.